EPAPER

AP Politce : అదే స్వామిభక్తి ! ప్రభుత్వం మారినా.. మారని పోలీసుల తీరు

AP Politce : అదే స్వామిభక్తి ! ప్రభుత్వం మారినా.. మారని పోలీసుల తీరు

Police Officers Tension in TDP : వైసీపీ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన క్షేత్ర స్థాయి పోలీసుల అధికారులను మార్పు చేయకపోవడంతో వారు ఇప్పటికీ గత వాసనలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమ స్వామి భక్తిని యదేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధం అని తెలిసినప్పటికీ ర్యాలీలకు అనుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వం మారినా అధికారుల అండతో వైసీపీ నేతల రాజసం చూస్తూ కూటమి శ్రేణులు ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. అలాంటి అధికారులపై వస్తున్న విమర్శల గురించి ప్రశ్నిస్తే.. తమను ఎలాగు బదిలీ చేస్తారు కదా అంటున్నారంట.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వైసీపీ పట్ల తమ స్వామి భక్తిని వీడటం లేదు. గత ప్రభుత్వంలో నియమితులైన వారు వైసీపీకి ఎంత సరెండర్ అయి పని చేశారో.. తాజాగా చంద్రగిరి, మదనపల్లి ఇష్యూలలో బయటపడింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు తర్వాత మోహిత్‌రెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.

బెయిల్ దక్కదేమోనని అరెస్ట్ భయంతో విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా.. సమాచారం తెలుసుకున్న పోలీసుల బెంగుళూరు విమానాశ్రయంతో మోహిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి చెవిరెడ్డి కుమారుడని తీసుకురావడానికి వందమంది పోలీసులు వెళ్లారు. తీరా తీసుకొచ్చాక తర్వాత కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 41ఎ నోటీసు ఇచ్చి పంపించారు. సదరు ఎపిసోడ్ నడిచిన 12 గంటల వ్యవధిలో చెవిరెడ్డి ఫ్యామిలీకి పోలీసులు మంచి సెంటిమెంటల్ పబ్లిసిటీ ఇచ్చారు.


Also Read : జగన్‌ని వెంటాడుతున్న భయం, ఈసారి..

పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వందలాది మంది అనుచరులతో ఊరేగింపుగా తీసుకెళుతుంటే పోలీసులు పహారా కాయడం విశేషం. ఎన్నికల్లో గెలిచిన కేండెట్లా ర్యాలీ నిర్వహించిన మోహిత్‌రెడ్డి రోడ్డుపై నడుస్తూ ఎక్కడికక్కడ మీడియాతో మాట్లాడుతూ దర్పం ప్రదర్శించారు. వందల కేసులు పెట్టినా తాను భయపననని స్టేట్ మెంట్లు ఇస్తూ వెళ్లిపోయారు.

ఎన్నికల ఫలితాల ముందు ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనపై దాడి కేసులో విచారణకు ఎస్వీ పోలీస్ స్టేషన్‌ను కు హాజరు అయ్యారు. ఆ సమయంలో పోలీసుల ప్రవర్తన విపరీతంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. నాని స్టేషన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా బలవంతంగా తరలించారు. అదే సమయంలో మీడియాపై విరుచుకు పడ్డారు. అది గతం.. నిన్న అయితే స్టేషన్ ఎదుట చేవిరెడ్డి వందలాది మంది అనుచరులతో బైఠాయించి హాడావుడి చేశారు. కొత్త ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తర్వాత స్టేషన్ నుంచి వచ్చిన మోహిత్ రెడ్డి గంట పాటు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చిన అక్కడున్న డిఎస్పీలు కాని పోలీసు అధికారులు కనీసం స్పందించలేదు. తర్వాత తీరిగ్గా చెవిరెడ్డి అయన కూమారుడు ఎస్వీ యూనివర్సిటిలోకి వెళ్ళి తర్వాత బయటకు వచ్చి రహాదారిపై ఉన్న అంభేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. వారు వెళ్లిపోయాక పోలీసులు తీరికగా 144 సెక్షన్ ఉందని ఓ ప్రకటన చేశారు. అలా చెవిరెడ్డి ఫ్యామిలీ కావాల్సినంత మైలేజీ పొందేలా.. తిరుపతి పోలీసులు తమ స్వామి భక్తి ప్రదర్శించారు.

Also Read : వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ కంటే కేతిరెడ్డి బెటర్..

మదనపల్లి పైల్స్ దగ్ధం కేసులో ఇదే విధంగా జరుగుతుంది. దాంతో ఆ కేసు విచారణకు కర్నూలు పోలీసుల మీద అధారాపడి వస్తుందని అంటున్నారు. 21వతేది నాడు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం అయిన కేసులో ప్రదాన నిందితుడు అయిన మాధవరెడ్డి పరారు కావాడానికి సిఐతో పాటు పోలీసులు చక్కగా సహకరించారన్న ఆరోపణలున్నాయి. దాంతో పాటు తనిఖీలు విషయాలు ముందుగా లీక్ చేస్తుండటంతో.. నిందితులు రికార్డులు దాస్తుండటంతో పాటు పరారు అవుతున్నారని అంటున్నారు.

రెవెన్యూ అధికారులు సైతం అలాగే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందుకే జిల్లాలో సీఐ, ఎస్ఐలతో పాటు ఎస్ బి, ఇంటలిజెన్స్ పోలీసులను సైతం మార్చాలని కూటమి నేతలు కోరుతున్నారు. గతంలో 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అప్పట్లో క్షేత్ర స్థాయి పోలీసులను మార్చలేదు. దీంతో ప్రభుత్వానికి సరైన సమాచారం రాలేదని.. అప్పట్లో అది కూడా ఓటమికి ఒక కారణమైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా స్వామి భక్తి ఉన్నవారిని గుర్తించి వారిని బదిలీ చేయాలని.. అదే విధంగా మదనపల్లి, చంద్రగిరి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×