EPAPER

Anshuman Gaekwad: విషాదం.. అనారోగ్యంతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

Anshuman Gaekwad: విషాదం.. అనారోగ్యంతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

Anshuman Gaekwad passed away(Today’s sports news): భారత మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్(71) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గైక్వాడ్‌..ఇకలేరని బీసీసీఐ బుధవారం రాత్రి ప్రకటించింది. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. ఇటీవల లండన్ లో చికిత్స తీసుకొని నెలరోజుల క్రితమే ఇండియాకు తిరిగివచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


భారత జట్టు సభ్యుడిగా పనిచేసిన గైక్వాడ్..1974-87 మధ్య భారత్ తరఫున 40 టెస్టులు, అ5 వన్డే మ్యాచ్ లు ఆడారు. రెండు ఫార్మాట్‌లలో కలిపి 2,254 పరుగులు చేశారు. ఇందులో రెండు సెంచరీలు చేసిన ఆయన..1983లో జలంధర్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్‌పై 201 పరుగులు చేశారు. అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా కూడా పనిచేశారు.

వెస్టిండీస్ టీంపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన గైక్వాడ్..బరోడా తరఫున 250 దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడారు. ఈయన కోచ్ గా ఉన్న సమయంలో 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్ గా నిలిచింది. 1990లో జాతీయ టీం సెలెక్టర్ గా, ఇండియన్స్ క్రికెటర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా పనిచేశారు. గైక్వాడ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీసీసీఐ సెక్రటరీ జై షా, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ లు ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.


Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×