EPAPER

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.. బీఆర్ఎస్‌‌కు మళ్లీ కౌంటర్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.. బీఆర్ఎస్‌‌కు మళ్లీ కౌంటర్

CM Revanth Reddy Chit Chat with Media: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి క్లియర్ గా చెప్పారు. అంతకుమించి సమాధానం ఏముంటుంది. సునీత లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఆ అక్క బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్ పర్సన్ అయ్యారు. నాపై కేసులు అలాగే ఉన్నాయి.. వాళ్లపై కేసులు మాఫీ అయ్యాయి. కౌడిపల్లి, నర్సాపూర్ లో 2 కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల చుట్టూ ఇంకా తిరుగుతున్నా.


2014లో సబితకు అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. 2018లో ఉత్తమ్ టికెట్ ఇచ్చారు. నన్ను కాంగ్రెస్ లో చేర్చి అక్క బీఆర్ఎస్ లోకి వెళ్లింది. తమ్ముడిని ఒంటరిని చేసి అక్క అన్యాయం చేసింది. నేను పొలిటికల్ అనుభవాలు మాత్రమే చెప్పాను. బాధ్యత తీసుకుంటానని చెప్పి నాకు టికెట్ ప్రకటించగానే బీఆర్ఎస్ లోకి వెళ్లింది.

Also Read: గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం


అక్కలకు అన్యాయం జరిగితే కేసీఆర్, హరీశ్ ఎందుకు రాలేదు. సబితక్క ఆవేదన చూసి అయినా కేసీఆర్, హరీశ్ రావు సభకు రావాలి కదా..?

ఈ సభ చాలా డెమోక్రటిక్ గా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కు బాధ్యత లేదు. అధికారం ఉంటే సభకు వస్తా.. లేకపోతే రానని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావు సరిపోతే కేసీఆర్ ఫ్లోర్ లీడర్ గా ఎందుకు?

ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. చర్చకు ఇవ్వాల్సినంత సమయం ఇచ్చాం. భవిష్యత్తులో శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావొచ్చు. మా సంపత్, వెంకట్ రెడ్డిల సభ్యత్వం రద్దు కాలేదా? గతంలో నన్ను సభకే రానివ్వలేదు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Related News

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×