EPAPER

Suryakumar Yadav: నేను కెప్టెన్ కాదు.. లీడర్ ని మాత్రమే: సూర్యకుమార్

Suryakumar Yadav: నేను కెప్టెన్ కాదు.. లీడర్ ని మాత్రమే: సూర్యకుమార్

Suryakumar statement after Ind Vs SL 3rd T20I(Sports news in telugu): శ్రీలంకతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ ఫీవర్ దేశమంతా నడుస్తోంది. ఈ సమయంలో సూర్య కుమార్ మాట్లాడుతూ నేను కెప్టెన్ కాదు.. ఒక జట్టుని నడిపించే లీడర్ ని మాత్రమేనని అన్నాడు. స్కూల్ లీడర్ లా.. టీమ్ ఇండియా టీ 20 జట్టుకి లీడర్ ని మాత్రమేనని అన్నాడు.


నిజానికి మేం చివరి ఓవర్ లో గెలిచామన్న సంతోషంకన్నా ముందు నాకెంతో ఆనందంగా అనిపించే విషయం ఒకటి ఉందని అన్నాడు. మ్యాచ్ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే 30 పరుగులకి 4 వికెట్లు, 48 పరుగులకి 5 వికెట్లు పడిపోయిన దశ నుంచి లేచి, ప్రత్యర్థులకి 137 పరుగుల టార్గెట్ ఇవ్వడం గొప్ప విషయమని అన్నాడు. ఎందుకంటే ఆ పిచ్ మీద 140 పరుగులు ఉంటే చాలని అనుకున్నామని తెలిపాడు.

కానీ 3 పరుగులు తగ్గాయి. అదే చివర్లో టెన్షన్ పెట్టిందని నవ్వుతూ అన్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి వరకు ఆడటం అనేది నాకు నచ్చిందని అన్నాడు. అదే నేడు మమ్మల్ని గెలిపించిందని అన్నాడు. లాస్ట్ ఓవర్ మ్యాజిక్ కాదని అన్నాడు. అక్కడా పరుగులున్నాయి కాబట్టి, మేం బౌలింగు చేశాం లేదంటే చేసేవాళ్లమా? అని ప్రశ్నించాడు.


Also Read: సంజూ శాంసన్ కి ఏమైంది?

ఈ క్రెడిట్ అంతా గిల్, రియాన్, వాషింగ్టన్ సుందర్.. వీరిదేనని అన్నాడు. ఇలా ఆడే తరహాలో టీమ్ ఉంటే, ఏ జట్టయినా నిరభ్యంతరంగా ఆడుతుందని అన్నాడు. మనం పోయినా పర్వాలేదు. వెనుకున్నారనే ధైర్యం జట్టుకి గొప్ప బలమని అన్నాడు. ఇకపోతే నేను మొదట క్రీజులోకి వెళ్లినప్పుడు కొంచెం ఒత్తిడి ఫీలవుతాను. ఒకసారి కుదురుకున్నానంటే, ఆటని ఎంజాయ్ చేస్తానని తెలిపాడు.

నేను కెప్టెన్ అనుకొని రాలేదు. వచ్చాను. కెప్టెన్ అయ్యాను. అది అలంకారంగా భావిస్తే పర్వాలేదు.. అహంకారంగా మారితేనే ప్రమాదమని నవ్వుతూ అన్నాడు. నా సహచర ప్లేయర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఫలితం రాబట్టడమే నా విజయ రహస్యమని అన్నాడు.

అయితే మ్యాచ్ ప్రారంభంలో సిరాజ్ బౌలింగులో సంజూ శాంసన్ క్యాచ్ డ్రాప్ చేశాడు. దాంతో తను డిప్రెషన్ లోకి వెళ్లిపోతే, తను వెన్నుతట్టి నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి సూర్యకుమార్ రాకతో టీ 20 క్రికెట్ కి కొత్త కళ వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×