EPAPER

IND vs SL 3rd T20I Match: ఓల్డ్ టెక్నిక్కులతో.. సూర్యా కెప్టెన్సీ!

IND vs SL 3rd T20I Match: ఓల్డ్ టెక్నిక్కులతో.. సూర్యా కెప్టెన్సీ!

India vs Sri lanka 3rd t20 highlights(Sports news headlines): టీ 20 క్రికెట్ చరిత్రలో శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్.. ఒక థ్రిల్లింగ్ విక్టరీగా మిగిలిపోతుంది. గెలుపు ముంగిట వరకు వచ్చి.. శ్రీలంక బోల్తా కొడితే, ఆఖరి బాల్ వరకు గెలుపుపై ఆశ వదలకుండా సూర్యకుమార్ పోరాడిన తీరు అద్భుతమని చెప్పాలి. ఇకపోతే తను సృష్టించిన ఒక మాయలో శ్రీలంక పడిపోయింది.


ఎప్పటిలా రెగ్యులర్ బౌలర్లు వేస్తారు. అలవాటైపోయిన బౌలింగుని ఎడాపెడా కొట్టేద్దామిని శ్రీలంక బ్యాటర్లు ఫిక్స్ అయ్యారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రింకూ సింగ్ తో బౌలింగు చేయించడం ఒక మాయ అయితే, ఏకంగా ఆఖరి ఓవర్ ను తనే బౌల్ చేయడం మరో మాయగా మారిపోయింది. ఈ రెండు ఓవర్లలోనే 4 వికెట్లు రావడం విశేషం.

అంటే సూర్యకుమార్ కెప్టెన్సీ మాయలో శ్రీలంక చిక్కుకుని విలవిల్లాడింది. పరాజయం పాలైంది. ఈ తరహా కెప్టెన్సీని ఒకనాటి పాతతరం కెప్టెన్లు వాడేవారు. అందులో అజారుద్దీన్ ప్రథముడిగా ఉండేవాడు. తను కూడా మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు ఆఖరి ఓవర్ ను ఎవరూ ఊహించని రీతిలో స్పిన్నర్లకి ఇచ్చేవాడు.


Also Read: లీగల్ నోటీసులు ఇచ్చిన.. మను బాకర్ టీమ్

అది కూడా రెగ్యులర్ స్పిన్నర్లు కాదు. జట్టులో ఎల్లవేళలా రెడీ టూ గో అన్నట్టుండే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి ఇచ్చేవాడు. అలా తను ఎన్నో విజయాలు కూడా అందించాడు. ఈ ఫార్ములాని మరికొన్ని జట్లు మరో విధంగా మొదలుపెట్టాయి. గేమ్ ప్రారంభమైనప్పుడు మొదటి ఓవర్ ని స్పిన్నర్లతో వేయించి, ప్రయోగాలు చేసిన సందర్భాలున్నాయి.

ఇదే ఫీటుని మళ్లీ సూర్యకుమార్ ఫాలో అవడం చూస్తుంటే రాబోవు రోజుల్లో మరెన్ని చిత్రాలు చేస్తాడోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

Big Stories

×