EPAPER

Nothing Phone 2a Plus Launch: తోపు ఫోన్ వచ్చింది.. నథింగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. మాములుగా లేదే!

Nothing Phone 2a Plus Launch: తోపు ఫోన్ వచ్చింది.. నథింగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. మాములుగా లేదే!

Nothing Phone 2a Plus: నథింగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ (2a) ప్లస్‌ను ఈరోజు జులై 31న దేశంలో విడుదల చేయనుంది. ఈ కొత్త మోడల్ అనేక అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్, ర్యామ్ గురించి కంపెనీ వెల్లడించింది. ఇటీవల కంపెనీ తన కెమెరా సిస్టమ్ గురించి సమాచారాన్ని అందించింది. ఇందులో రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. 6.7 అంగుళాల సూపర్ అమ్లోడ్ డిస్‌ప్లే ఉంటుంది. నథింగ్ (2a) సక్సెసర్‌‌గా 2 (a) ప్లస్‌ని కంపెనీ తీసుకొస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


నథింగ్ ఫోన్ (2a) ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రెండు 50MP సెన్సార్లు ఉంటాయి. అయితే ఈ కొత్త ప్లస్ మోడల్‌లో ఫ్రంట్ కెమెరా పెద్ద అప్‌గ్రేడ్‌‌తో వస్తుంది. ఫోన్ (2a) 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండగా (2a Plus) 50MP ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌తో వస్తుంది. ఈ కెమెరా వివరాలను కంపెనీ అఫిషియల్ X అకౌంట్‌లో షేర్ చేసింది. దీనిలో ఫోన్ వెనుక కెమెరా డిజైన్ కూడా వెల్లడైంది. దీని లేఅవుట్ ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్ (2a)కి చాలా దగ్గరగా ఉంటుంది.

Also Read: Flipkart Best Mobile Offer: వదిలితే ఎలా బ్రో.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.28 వేల డిస్కౌంట్.. ఇది చాలా బెస్ట్!


నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే  మీడియా నివేదికల ప్రకారం ప్లస్‌లో MediaTek డైమెన్సిటీ 7350 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌‌లలో వస్తుంది. అందులో 8GB RAM,  12GB RAM వేరియంట్లు ఉన్నాయి. స్టాండర్డ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఫోన్‌లో ర్యామ్ బూస్టర్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుతుంది. దీనితో మీరు టాప్ వేరియంట్‌లో 20GB RAM వరకు పొందుతారు.

కంపెనీ దీనిని బ్లాక్, గ్రే కలర్ వేరియంట్లలో రెండు కలర్ ఆప్షన్లలో తీసుకురానుంది. హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. దీనిలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ (2a) ప్లస్ 50W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ (2a) కంటే బెటర్‌గా ఉంటుంది.

Also Read: Raksha Bandhan Mobile Offers: రక్షాబంధన్ ఆఫర్స్.. సగం ధరకే స్మార్ట్‌ఫోన్లు.. గిఫ్గ్‌గా ఇచ్చేయండి!

నథింగ్ 2a ప్లస్ వేరియంట్ కూడా 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. నథింగ్ ఫోన్ 2A ప్లస్ ధర రూ. 30,000 లోపు ఉండవచ్చని అంచనా. ఇంతకుముందు కంపెనీ నథింగ్ ఫోన్ 2A ను రూ. 23,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అదే సమయంలో మరింత ప్రీమియం ఫోన్ కావాలనుకునే వారి కోసం కంపెనీ రూ.44,999కి నథింగ్ ఫోన్ 2ని విడుదల చేయనుంది.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×