EPAPER

Chat GPT Vs Google: గూగుల్ సెర్చ్‌కి పోటీగా.. చాట్ జీపీటీ

Chat GPT Vs Google: గూగుల్ సెర్చ్‌కి పోటీగా.. చాట్ జీపీటీ

అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వచ్చాయి. గూగుల్ గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ప్రత్యర్థులు పదునైన ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. గూగుల్ సెర్చ్‌కి పోటీగా చాట్ జీపీటీ కొత్తగా ఓ సెర్చ్ ఇంజిన్‌ను తయారు చేస్తుంది. దీనితో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు సవాల్ ఎదురుకానుందనే చర్చ నడుస్తోంది. ఈ కొత్త సెర్చ్ ఇంజిన్‌కు సెర్చ్ జీపీటీగా పేర్కొంటున్నారు. సెర్చ్ ఇంజిన్ రంగంలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించిన గూగుల్‌ను ఈ నూతన సెర్చ్ జీపీటీ అణిచేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త సెర్చ్ ఇంజిన్ ప్రస్తుతం ‘ప్రోటోటైప్’ దశలో ఉంది.

ఏఐ నమూనాలను వెబ్ నుండి లభించే సమాచారంతో మిళితం చేయడానికి ఈ కొత్త ప్రోటో టైప్ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. పరిమిత స్థాయిలో యూజర్లతోనూ, పబ్లిషర్లతోనూ దీనిని పరీక్షిస్తున్నట్లు ఓపెన్ ఏఐ పేర్కొంది. సెర్చ్ జీపీటీ సాయంతో రియల్ టైమ్ డేటా యూజర్ల ముందు ప్రత్యక్షమవుతుందని సంస్థ తెలియజేసింది. సెర్చ్ జీపీటీలో ఏదైనా అంశం గురించి టైప్ చేస్తే దానికి సంబంధించిన సమాచారంతో పాటు ఆ కంటెంట్ మూలాధారమైన వనరుల లింకు‌లు కూడా స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. యూజర్ల నుంచి వచ్చే అనుబంధ ప్రశ్నలకు కూడా సెర్చ్ జీపీటీ సమాధానమిస్తుంది. ప్రస్తుతం, ఇది వెయిటింగ్ లిస్ట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉందనీ.. భవిష్యత్తులో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కొత్త సెర్చ్ ఫీచర్‌తో వస్తున్న సెర్చ్ జీపీటీ గురించి ఓపెన్ఏఐ తన బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. సెర్చ్ జీపీటీ.. స్పష్టమైన, వేగవంతమైన, సరైన సమాధానాలు ఇస్తుందని ఓపెన్ ఏఐ వెల్లడిస్తోంది.


అయితే, సెర్చ్ జీపీటీ గూగుల్ తరహాలోనే ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. సెర్చ్ జీపీటీ హోమ్ పేజీ గూగుల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇక, దీన్ని ఓపెన్ చేయగానే “మీరు దేని కోసం చూస్తున్నారు?” అనే సందేశం కనిపిస్తుంది. సెర్చ్ క్వైరీని ఎంటర్ చేసిన తర్వాత.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూ ఫీచర్‌తో సమాధానం లభిస్తుంది. ఇందులో కచ్చితమై సమాధానంతో పాటు, సంబంధిత సమాచారాన్ని కూడా ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ అందిస్తుంది. ఇక్కడ ఓపెన్ ఏఐ ఉదహరించిన అన్ని లింక్‌లను చూసే అవకాశం ఉంటుంది. ఇక, ఇందులో మరింత వివరణాత్మక సమాచారం కూడా పొందవచ్చని తెలుస్తోంది.

అదనంగా, చాట్ జీపీటీ మాదిరిగానే, వినియోగదారులు మరింత సమాచారాన్ని పొందడానికి ఫాలో-అప్ ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఇక, సెర్చ్ జీపీటీ, గూగుల్ సెర్చ్ కంటే మెరుగ్గా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం తీవ్రంగా నడుస్తున్న చర్చ. అయితే, చాట్ జీపీటీ, గూగుల్ అనేవి రెండు అధునాతన సాంకేతికతలు. ఇవి సహజమైన భాషను అర్థం చేసుకొని, దానికి ప్రతిస్పందిస్తాయి. చాట్ జీపీటీ, గూగుల్ రెండూ వాటి సొంత ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ.. అవి వేర్వేరు ప్రయోజనాల కోసం ఉపయోగించే సాధానాలు. చాట్ జీపీటీ అనేది అధునాతన ఏఐ చాట్‌బాట్ కాగా.. ఇది సహజ భాషను అర్థం చేసుకోగలదు, ప్రతిస్పందించగలదు.

Also Read: వదిలితే ఎలా బ్రో.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.28 వేల డిస్కౌంట్.. ఇది చాలా బెస్ట్!

అయితే, గూగుల్ దానికి భిన్నంగా ఇంటర్నెట్‌లో నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనడానికి ఉపయోగించే శక్తివంతమైన సెర్చ్ ఇంజిన్‌గా పనిచేస్తుంది. అయితే, ఇప్పుడు గూగుల్ సెర్చ్ మాదిరిగానే.. సెర్చ్ జీపీటీ కూడా వస్తే దాని పనితనం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గూగుల్ సెర్చ్‌కి ముందు.. తర్వాత కూడా కొన్ని సెర్చ్ ఇంజిన్లు లేకపోలేదు. అయితే, గూగుల్ సెర్చ్ ధాటికి అవి నిలవలేకపోయాయి. ఇప్పుడు, సెర్చ్ జీపీటీ కూడా అలాగే కనుమరుగవుతుందా.. లేదా గూగుల్‌ సెర్చ్‌కు గట్టి పోటీ ఇస్తుందా అనేది తేలాలి. అయితే, సెర్చ్ జీపీటీ అనేది గూగుల్ సెర్చ్ వంటి ఇతర ఏఐ ఆధారిత సెర్చ్ స్టార్టప్‌లకు ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుందనేది ప్రస్తుతానికి ఉన్న అంచనా. అయితే, దీని పనితనాన్ని మాత్రం ఇప్పుడు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే, కొత్త చాట్‌బాట్‌లతో మార్కెట్‌‌లోకి వస్తున్న కొత్త కొత్త పోటీదారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

అందులో భాగంగానే తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఈ జీపీటీ సెర్చ్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ మార్కెట్లో సెర్చ్ ఇంజిన్ కేంద్ర బిందువుగా మారడంతో ఈ మార్పు ఆవశ్యకంగా మారింది. ఉదాహరణకు, గూగుల్ తర్వాత రన్నింగ్‌లో ఉన్న పర్‌ప్లెక్సిటీ.. దాని AI-సామర్థ్యంతో కూడిన సెర్చ్ ఇంజిన్‌తో ఖచ్చితత్వం, మూలాధారాన్ని స్పష్టంగా అందిస్తున్న కారణంగా గణనీయంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక, గూగుల్ కూడా AI చుట్టూ దాని ప్రధాన సెర్చ్ అనుభవాన్ని చురుకుగా తిరిగి నిర్మిస్తోంది. రాబోయే రోజుల్లో గూగుల్ జెమిని AI మోడల్‌ని కూడా మరింత మెరుగ్గా అందించే అవకాశం కనిపిస్తోంది.

ఇక, గూగుల్ తర్వాత, సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ బింగ్ రెండవ స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే దాని కోపిలట్ ఫీచర్‌తో దాని సెర్చ్, AI సామర్థ్యాలను వేగవంతం చేస్తోంది. ఇది జీపీటీ-4 మోడల్‌ను దాని బింగ్ సెర్చ్ ఇంజిన్‌లో అనుసంధానిస్తుంది. అలాగే, యాహూ, డక్‌డక్ గో, ఆస్క్ డాట్ కామ్, బైడు, ఎమ్ఎస్ఎన్ లాంటి సెర్చ్ ఇంజిన్లు ఇప్పుడు మార్కెట్లో ఆటుపోట్లతో నడుస్తూనే ఉన్నాయి. అయినా, మార్కెట్ వాటాలో గూగుల్ సెర్చ్ 92 శాతానికి పైగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, ప్రపంచమంతా 10 సెర్చ్‌లు చేస్తే అందులో 9 కంటే ఎక్కువ గూగుల్ సెర్చ్‌లో వెదుకుతున్నారు. ఇక, సెర్చ్ మార్కెట్ వాటాలో దాదాపు 3 శాతంతో బింగ్ రెండో స్థానంలో ఉంది. ఇక ప్రస్తుతమున్న మిగిలిన సెర్చ్ ఇంజిన్లకు ఒకొక్కరికీ ఒక శాతం, అంతకంటే తక్కువ వాటానే దక్కుతుంది. ఈ లెక్కలను బట్టి, గూగుల్ కాకుండా మరో సెర్చ్ ఇంజిన్ వచ్చి నిలబడటం అనేది అంత సులువు కూడా కాదు.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×