EPAPER

Suryakumar Yadav: గేమ్ ఛేంజర్ అవార్డు గెలుచుకున్న టీమ్ ఇండియా కెప్టెన్

Suryakumar Yadav: గేమ్ ఛేంజర్ అవార్డు గెలుచుకున్న టీమ్ ఇండియా కెప్టెన్

Suryakumar Yadav latest news(Sports news today): క్రికెట్ చరిత్రలో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ గా శ్రీలంక వర్సెస్-ఇండియా మూడో టీ 20 మ్యాచ్ నిలిచిపోనుంది. ఈసారి మ్యాచ్ ను చూసి మురిసిపోయిన నిర్వాహకులు కొత్తగా గేమ్ ఛేంజర్ అవార్డును ప్రకటించి.. అది టీమ్ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ కి ఇచ్చారు. తన అద్భుత కెప్టెన్సీ ప్రయోగాలతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను గెలిపించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి.


12 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో రింకూ సింగ్ కి బౌలింగు ఇవ్వడం మ్యాచ్ కి హైలైట్ అయితే, ఆ ఓవర్ లో రెండు వికెట్లు రావడం మరో హైలైట్ గా నిలిచింది. ఇక ఆఖరి ఓవర్ లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ స్వయంగా బౌలింగుకి రావడం గొప్ప విషయంగా నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఎందుకంటే తను బౌలరు కాదు, ఆల్ రౌండర్ కాదు, పార్ట్ టైమ్ బౌలర్ అంతకన్నా కాదు.. కేవలం టీ 20 స్పెషలిస్టు బ్యాటర్. తనకింకా టెస్టు మ్యాచ్ ల్లో అవకాశమే రాలేదు. వన్డేల్లో ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి.


Also Read: పారిస్ ఒలింపిక్స్, ప్రియుడితో ఎంజాయ్, పోటీల నుంచి స్విమ్మర్ ఔట్

అలాంటి హార్డ్ హిట్టర్ అయిన సూర్య కుమార్ స్వయంగా తనే బౌలింగు చేయడం అంటే, మామూలు విషయం కాదు. అదీకాక ఆఖరి ఓవర్ వేరే బౌలర్ కిచ్చి, మ్యాచ్ ఓడిపోతే, అతన్ని నిందించకుండా.. ఆ భారాన్ని తనపైనే వేసుకుని బౌలింగు చేసిన తీరు చూసి.. ‘ఏం గుండె రా నీది’…అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక మూడో టీ 20 మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వాషింగ్టన్ సుందర్ కి ఇచ్చారు. మ్యాచ్ కీలకమైన సమయంలో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. అంతేకాదు సూపర్ ఓవర్ లో రెండు వికెట్లు తీసి, టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించినందుకు అవార్డు దక్కించుకున్నాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×