EPAPER

Rythu Runa Mafi second Phase: రెండో విడత రుణమాఫీ.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Rythu Runa Mafi second Phase: రెండో విడత రుణమాఫీ.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Rythu Runa Mafi Second Phase: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ అమలు చేశారు. ఈ మేరకు రూ.లక్షన్నరలోపు ఉన్నవారికి రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే రూ.లక్ష ఉన్నవారికి రుణమాఫీ పూర్తి చేశారు.


రైతు రుణమాఫీ చేయడంతో మా జన్మ ధన్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనం కాదు..రైతుల ప్రయోజనమే ముఖ్యమన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పంటబీమా తీసుకొచ్చింది కాంగ్రెస్..ఆహారభద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ అని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల చేశారు. మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98కోట్లు విడుదల చేయనున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా 17మంది రైతులకు చెక్కులు అందజేయనున్నారు. అంతకుముందు మొదటి విడత కింద 11,34,412 మంది రైతులకు రూ.6034.96 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.


జిల్లాల వారీగా చూస్తే..

  • వికారాబాద్ – 23, 912 మంది రైతులు – రూ.240.07 కోట్లు,
  • మహబూబ్ నగర్ – 22,253 – రూ.219.18 కోట్లు,
  • నిజామాబాద్ – 23,769 – రూ.219.53 కోట్లు,
  • కరీంనగర్ – 21,785 – రూ.207.82 కోట్లు,
  • కామారెడ్డి – 24,816 – రూ.211.72 కోట్లు,
  • నిర్మల్ – 18,728 – రూ.196.86 కోట్లు,
  • యాదాద్రి భువనగిరి – 18,127 – రూ.177.48 కోట్లు,
  • జగిత్యాల – 17,903 – రూ. 169.11 కోట్లు,
  • నల్గొండ – 51,515 – రూ.514.26 కోట్లు,
  • నాగర్ కర్నూల్ – 32,406 – రూ.312.43 కోట్లు,
  • సంగారెడ్డి – 27,249 – రూ.286.76 కోట్లు,
  • సిద్దిపేట – 27,875 – రూ.277.21 కోట్లు,
  • సూర్యాపేట – 26,437 – రూ.250.96 కోట్లు,
  • ఖమ్మం – 33, 942  – రూ. 262.51 కోట్లు,
  • రంగారెడ్డి – 24,007 – రూ. 229.72 కోట్లు,
  • మెదక్ – 22,850 – రూ.229.72 కోట్లు,
  • వనపర్తి – 15,085 – రూ.140.86 కోట్లు,
  • పెద్దపల్లి – 13,401 – రూ. 124.41 కోట్లు,
  • కొమురం భీమ్ – 14,410 – రూ. 151.06 కోట్లు,
  • రాజన్న సిరిసిల్ల – 12,202 – రూ.117.77 కోట్లు,
  • వరంగల్ అర్బన్ – 11,818 – రూ.108.24 కోట్లు,
  • జయశంకర్ భూపలపల్లి – 8,851 – రూ. 92.50 కోట్లు,
  • ములుగు – 6,215 – రూ.65.25 కోట్లు,
  • మేడ్చల్ మల్కాజిగిరి – 789 – 6.15 కోట్లు,
  • హైదరాబాద్ – 4 – 0.05 కోట్లు,
  • వరంగల్ రూరల్ – 21,166 – రూ.190.58 కోట్లు,
  • మహబూబాబాద్ – 17,880 – రూ.186.42 కోట్లు,
  • ఆదిలాబాద్ – 18,390 – రూ.209.25 కోట్లు,
  • జోగుళాంబ గద్వాల – 15,401 – రూ.166.21 కోట్లు,
  • జనగామ – 15,401 – రూ.159.80 కోట్లు,
  • మంచిర్యాల – 14,396 – రూ.138.88 కోట్లు,
  • భద్రాద్రి కొత్తగూడెం – 17,308 – రూ.147.34 కోట్లు విడుదల చేశారు.

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×