EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. సన్నిహితులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం:
వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధన లాభం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులకు కేటాయించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదిత్య హృదయం చదవాలి.


మిథునం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. అనారోగ్యంతో ఇబ్బందులు పడతారు. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. వేంకటేశ్వరుడిని పూజిస్తే సమస్యలు తీరుతాయి.

సింహం:
సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మనోబలం తగ్గకుండా సానుకూల ఆలోచనలతో పనిచేస్తే ప్రతి కార్యంలోనూ విజయం పొందుతారు. అనవసర ఖర్చులు ఉంటాయి. భూమి, ఆస్తి కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.

తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇతరులతో వాదనలు పెట్టుకోవద్దు. అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఊహించని లాభాలు ఉంటాయి. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆర్థిక సాయం అందుతుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కొన్ని వ్యవహారాల్లో సకాలంతో పనులు పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు మంచి గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ధనుస్సు:
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగులు తోటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఉత్సాహం కోల్పోవద్దు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దుర్గా అష్టోతర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వేధిస్తాయి. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తిచేస్తే ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. తోటివారి సలహాలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పొదుపు మార్గాలపై దృష్టి చేయాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు మనోధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల సలహాలతో పనులను విజయవంతంగా పూర్తవుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దుర్గాధ్యానం శుభకరం.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×