EPAPER

Dry Fruits: ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏం అవుతుందో తెలుసా !

Dry Fruits: ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏం అవుతుందో తెలుసా !

Dry Fruits: ఉరుకులు పరుగుల జీవితాల్లో కనీసం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినడానికి కూడా సమయం లేకుండా పోతుంది. ఉద్యోగం, బిజినెస్, కాలేజీలు, స్కూళ్లు అంటూ చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదు. ఏదో దొరికింది తింటూ పూట గడిపేస్తున్నారు. ఈ తరుణంలో జంక్ ఫుడ్ తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఇలా తీసుకుంటున్న వారిలో కొంత మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి అటు పనులను, ఇటు ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాహసాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బయట తిండి తింటూనే ఇంట్లోను కాస్త డైట్ ఫుడ్ మెంటేన్ చేస్తుంటారు. ఈ తరుణంలో ఎక్కువగా డ్రైఫ్రూట్స్, పండ్లు, ఆకుకూరలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఎలా పడితే అలా తినేస్తుంటారు. కానీ వీటిని ఎక్కువగా లేదా ఎలా పడితే అలా తీసుకున్నా కూడా ప్రమాదమే అని నిపుణులు అంటున్నారు.


డ్రైఫ్రూట్స్ ను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పూట తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయి. కానీ దీంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయట. డ్రైఫ్రూట్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వంటి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అంతేకాదు డ్రైఫ్రూట్స్ తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ పరగడుపున డ్రైఫ్రూట్స్ తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు.

అంతేకాదు శరీరం అలసిపోకుండా కూడా ఇవి మేలు చేస్తాయి. అయితే ఇలా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ప్రయోజనాలతో పాటు సమస్యలు కూడా ఉన్నాయి. పరగడుపున తరచూ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా అంజీర్, ఖర్జూరం వంటి వాటిని తీసుకుంటే ఈ సమస్యలు ఎదురవుతాయి. అయితే వీటితో ప్రయోజనాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఖర్జూరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.


జీడిపప్పును తీసుకోవడం వల్ల చాలా మంది బరువు పెరుగుతారు అని అపోహ పడతారు. కానీ జీడిపప్పులో ఎటువంటి కొలస్ట్రాల్ ఉండదు. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడుతుంది. అందువల్ల ప్రతీరోజూ జీడిప్పును 5 నుంచి 6 తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం శరీరం నుంచి ఉప్పు శాతం తొలగించి రక్తపోటును అదుపులోకి తెచ్చేందుకు తోడ్పడుతుంది. డ్రైఫ్రూట్స్ పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలే కాదు బరువు పెరిగే సమస్య కూడా ఉంటుంది.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×