EPAPER

Harmful Foods For Teeth: మీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పదార్థాలకు దూరంగా ఉండండి

Harmful Foods For Teeth: మీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పదార్థాలకు దూరంగా ఉండండి

Harmful Foods For Teeth: మనలో చాలామంది ముఖం, జుట్టు ఆరోగ్యం మీద పెట్టినంత శ్రద్ధ నోటి ఆరోగ్యంపైన అస్సలు పెట్టరు. ఏదైనా దంత సమస్యలు, చిగుళ్లలో నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తితే గానీ దాని ప్రాధాన్యత ఏంటో అర్థం కాదు. కాబట్టి దంత సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం తినే ఆహారాలలో కొన్ని పళ్లను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే మీ పళ్లు ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ పళ్లను దెబ్బతీసే ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


పాప్ కార్న్:
థియేటర్‌కు వెళ్లినప్పుడు, షాపింగ్ కోసం బయటకు వెళ్లినప్పుడు మనలో చాలా మందికి పాప్ కార్న్ తినే అలవాటు ఉంటుంది. ఇక పిల్లలైతే ఎంతో ఇష్టంగా పాప్ కార్న్ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఇది దంతాలను చాలా దెబ్బ తీస్తుంది. అవును మీరు వింటున్నది నిజమే. పాప్ కార్న్‌లో ఉండే హార్డ్ ఫైబర్ దంతాలపై ఉండే ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి దంత సంరక్షణ కోసం పాప్ కార్న్ తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ కాఫీ:
పళ్లు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే కాఫీ, టీ లను తగ్గించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీలో టానిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడే అవకాశం ఉండటంతో పాటు ఎనామిల్ కూడా దెబ్బతింటుంది.
గ్రీన్ టీ:
ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలా మంది గ్రీన్ టీ తాగడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ టానిన్ కంటెంట్ ఉన్న టీలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
సిట్రస్ ఫ్రూట్స్:
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. వాటిలో ఉండే యాసిడ్ దంతాలపై ప్రభావం చూపడం వల్ల ఎనామిల్ దెబ్బతీసే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
పొగాకు:
ధూమపానం, గుట్కా నమలడం, మద్యం వంటివి చేయడం వల్ల నోటి పూత, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నోరు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
అధిక చక్కెర ఆహారాలు:
కుకీలు, కేకులు, క్యాండీలు, చాక్లెట్లు వంటివి అధిక చెక్కర ఉండే ఆహార పదార్థాలు వీటిని తినడం వల్ల దంతాలకు హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే చక్కెర పళ్ల మీద బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఇది దంతక్షయానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×