EPAPER

Harish Rao: వాయిస్ మార్చిన హరీశ్‌రావు.. కాంగ్రెస్ పనైపోయిందని మేము ఏ రోజైనా అన్నామా ? అంటూ..

Harish Rao: వాయిస్ మార్చిన హరీశ్‌రావు.. కాంగ్రెస్ పనైపోయిందని మేము ఏ రోజైనా అన్నామా ? అంటూ..

Harish Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైరయ్యారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
‘అసెంబ్లీని సభా నాయకుడు పక్కదారి పట్టిస్తున్నాడు. మోటార్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారని రేవంత్ వి తప్పుడు ఆరోపణలు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేయకుంటే సోనియా తెలంగాణ ఇచ్చేదా?. కేసీఆర్ చేసినన్ని రాజీనామాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయలేదు. 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కు 21 శాతం ఓట్లు వచ్చాయి. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. అంతమాత్రానా కాంగ్రెస్ పనైపోయిందని మేము ఏ రోజైనా అన్నామా..?’ అంటూ ఆయన పేర్కొన్నారు.


‘మూడు సమావేశాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వం డిఫెన్స్ లో పడగానే ఏదో ఒక కాగితం తీసుకువచ్చి చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారు. గతంలో గోదావరి జలాలకు సంబంధించి రిటైర్డ్ ఇంజినీర్ల నివేదికను ప్రస్తావించారు.. అయితే, మేడిగడ్డ సాధ్యం కాదని మేం ఏరోజు చెప్పలేదు. మేడిగడ్డ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించొద్దంటూ మాత్రమే వారు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కొన్ని మాత్రమే చదివి.. మిగతా అంశాలను పక్కకుపెడుతున్నారు. విద్యుత్ మీటర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి మూడు పదాలు ఎగరగొట్టి చదివారు. సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయబోతున్నాం. పోతిరెడ్డిపాడు విషయంలోనూ అంతే జరిగింది. సభను తప్పుదోవ పట్టించారు. కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ నుంచి ఆనాడు తప్పుకున్నాం.

Also Read: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. రానున్న రెండు రోజులూ రాష్ట్రంలో..


మేం ఏనాడు కూడా పదవుల కోసం పాకులాడలేదు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని అసెంబ్లీలో మేం డిమాండ్ చేశాం. బీఆర్ఎస్ ఎక్కడికి పోలేదు.. తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుంది. అసలైన కాంగ్రెస్ నేతలు పక్కకు ఎందుకు పోయారు. డిసెంబర్ 9 తరువాత రైతులపై వడ్డీ భారం మోపుతున్నారు. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు చెల్లింపులు చేసింది. ప్రతి నెలా రూ. 200 నుంచి 300 కోట్ల వరకు చెల్లింపులు చేస్తూ వచ్చినాము. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎనిమిది నెలల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’ అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, సోమవారం అసెంబ్లీలో 19 పద్దులపై 17 కోత తీర్మానాలను ఆయన ప్రతిపాదించారు. మన ఊరు – మన బడి పనుల నిలిపివేత, స్కూళ్లలో పారిశుద్ధ్యం, గొర్రెల పంపిణీ చేయకపోవడం, ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అపాయింట్ డే ప్రకటించకపోవడం, శాంతిభద్రతలకు సంబంధించి, ట్రాఫిక్ సమస్యలు, గ్రామాలు – పట్టణాలకు నిధుల విషయమై, ఐదు డీఏలకు సంబంధించి, కేసీఆర్ కిట్ల పథకం అమలు విషయమై.. ఇలా మొత్తం పదిహేడు కోత తీర్మానాలను ఆయన ప్రతిపాదించారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×