EPAPER

Diabetes survey:వీళ్లు ఎక్కువ సేపు నిద్రపోతే..అంతే సంగతులు

Diabetes survey:వీళ్లు ఎక్కువ సేపు నిద్రపోతే..అంతే సంగతులు

Diabetes risk with oversleeping study of U-shaped association: సుఖమైన నిద్ర, వేళకు భోజనం చేసేవారు ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులని అంటారు. ముఖ్యంగా నిద్ర సుఖమెరగదు అంటారు. పట్టు పరుపులపై పవళించినా..కటిక నేలపై నిద్రించినా నిద్ర ఒకటే. కాకపోతే చాలా మంది వైద్యులను సంప్రతిస్తుంటారు. తనకు రాత్రుళ్లు నిద్ర పట్డడం లేదని..కొందరైతే తమకు అతి నిద్ర రోగం పట్టుకుందని వాపోతుంటారు. పగటిపూట 12 గంటలయినా పక్క మీదనుంచి లేవడం వీరికి కష్టతరం. మత్తు వదలరా..నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా.. అంటూ ఘంటసాల పాట ఎంతో పాపులర్. ఆ పాటలో అతి నిద్రా లోలుడు తెలివిలేని మూర్ఖుడు అంటారు. అయితే పాట సంగతి ఎలా ఉన్నా అతిగా నిద్రపోతే ఏమవుతుందో ..అతి తక్కువగా నిద్రపోతే ఏమవుతుందో చెబుతున్నారు అమెరికన్ నిపుణులు.


నియమానుసారం నిద్ర

యు షేప్డ్ అసోసియేషన్ సరికొత్తగా చేసిన అధ్యయనంలో కొత్త సంగతులు తెలియజేసింది. కొందరు షుగర్ వ్యాధిగ్రస్తులను అధ్యయనం చేసిన ఈ సంస్థ అతిగా నిద్రపోయినా..తక్కువ నిద్రపోయినా వారిలో షుగర్ శాతం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని అంటున్నారు. కొందరు శారీరక శ్రమ లేకుండా ఎనిమిదేసి గంటలు నిద్రపోతుంటారు. అటువంటి వారిలో షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. తిండితో పాటు నిద్ర కూడా షుగర్ వ్యాధి గ్రస్తులు నియమానుసారం పాటించాలని అంటున్నారు.


మందులు వాడుతూనే కంట్రోల్

తిండి విషయంలో ఎలాంటి కంట్రోల్స్ పాటిస్తామో నిద్ర విషయంలోనూ అలాంటి నియంత్రణలు పాటిస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని అంటున్నారు అధ్యయనకారులు. అలాగని నిద్రను బేస్ చేసుకుని షుగర్ మందుల వాడకం మానేయొద్దని చెబుతున్నారు. వాటిని కంటిన్యూ చేస్తూనే నిద్రని కూడా నియంత్రించుకోగలిగితే ఆయుష్షు కూడా పెంచుకున్నవారవుతారని చెబుతున్నారు. నిద్ర అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. అది నియంత్రించే శక్తి మన చేతుల్లోనే ఉంది. కొన్నాళ్లు అలారం పెట్టుకుని నిద్రను కంట్రోల్ చేసుకోగలిగితే రానురానూ ఆ విధానానికి అలవాటు పడిపోతామని..కొన్నాళ్లకు అలారం అవసరం కూడా ఉండదని వైద్యులు చెబుతున్నారు.

Related News

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Big Stories

×