EPAPER

Israel Hezbollah War| ఇజ్రాయెల్ మరో యుద్ధం ప్రారంభించబోతోందా?.. గాజా లాగా లెబనాన్ లో కూడా వినాశనం తప్పదా?..

Israel Hezbollah War| ఇజ్రాయెల్ మరో యుద్ధం ప్రారంభించబోతోందా?.. గాజా లాగా లెబనాన్ లో కూడా వినాశనం తప్పదా?..

Israel Hezbollah War| ఇజ్రాయెల్ భూభాగంలోని గోలన్ హైట్స్ ప్రాంతంలో ఓ రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు చనిపోయిన తరువాత లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పెద్ద యుద్ధమే ప్రారంభంకాబోతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ చేసిన రాకెట్ దాడి వల్లే ఆ పిల్లలు చనిపోయినట్లు అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ హెజ్బుల్లా మాత్రం ఈ దాడి తాము చేయలేదని ప్రకటించింది.


శనివారం రాత్రి గోలన్ హైట్స్ ప్రాంతంలోని మజ్ద్ అల్ షమ్స్ ఫుట్ బాల్ స్టేడియంపై రాకెట్ దాడి ఘటనలో 12 మంది పిల్లలు అందరూ 10 నుంచి 20 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ రాకెట్.. ఇరాన్ లో తయారు చేయబడిందని.. దీనిపై ఉన్న వార్ హెడ్ బాంబు హెజ్బుల్లాకు చెందినదని ఇజ్రాయెల్ మిలిటరీ తన ప్రకటనలో చెప్పింది.

శనివారం జరిగిన దాడి తరువాత, ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం.. పలు రాకెట్ మిసైల్స్‌ తో హెజ్బుల్లా స్థావరాలపై దాడి చేసింది. దానికి సమాధానంగా హెజ్బుల్లా కూడా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ సైన్య స్థావరాలపై రాకెట్ దాడులు చేసింది. అయితే రెండు వైపులా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.


ఇప్పటికే లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య చాలా సంవత్సరాల నుంచి సరిహద్దుల్లో ఘర్ణణలు జరుగుతూనే ఉన్నాయి. గాజా యుద్ధం ప్రారంభమైన తరువాత ఈ ఘర్షణలు మరింత పెరిగాయి. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంతవరకు లెబనాన్ లో 500 మంది చనిపోగా.. వీరిలో 40 మంది పౌరులున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కు చెందిన 24 మంది సైనికులు, 22 మంది పౌరులు చనిపోయారు.

మజ్ద అల్ షమ్స్ ఇక చిన్న డ్రూజ్ పట్టణం. ఇక్కడ షియా ముస్లింలకు చెందిన డ్రూజ్ జాతికి చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ డ్రూజ్ జాతి వారు సిరియా, లెబనాన్ నే తమ దేశంగా భావిస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ నాయకులతో వీరికి స్నేహపూర్వక సంబంధాలున్నాయి. 1967లో జరిగిన యుద్ధంలో సిరియ దేశంలో భాగంగా ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ భూభాగం ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. తాజాగా ఈ ప్రాంతంలో రాకెట్ దాడి ఘటన జరగడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం మండిపడుతోంది.

రాకెట్ దాడి ఘటన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. దాడి సమాచారం తెలియగానే త్వరగా తన పర్యటన ముగించుకొని ఇజ్రాయెల్ చేరుకుని రక్షణ మంత్రి యోఆవ్ గల్లాంట్ తో అత్యవసర చర్చల్లో పాల్గొన్నారు. హెజ్బుల్లా చేసిన దాడికి ప్రతీకారంగా ఎవరూ ఊహించని వినాశనం జరుగుతుందని నెతన్యాహు ఉద్రేకంతో మీడియా ముందు చెప్పారు.

ఒకవైపు గాజా యుద్దంలో చనిపోయిన అమాయక పౌరుల సంఖ్య 39,000 దాటింది. దీంతో అమెరికా గాజా యుద్ధం ముగించేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు హెజ్బుల్లా దాడి చేయడంతో యుద్ధం ముగుస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈజిప్ట్, దోహా దేశాల చొరవతో అమెరికా ఇజ్రాయెల్, హమాస్ యుద్దాన్ని ఆపేందుకు చర్యలు చేపట్టింది. హెజ్బుల్లా దాడిపై అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ స్పందిస్తూ.. ఈ రెండు యుద్ధాలు ముడిపడి ఉన్నాయి. ఇజ్రాయెల్ తో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే గాజా సమస్యను పరిష్కారం చేసి.. హెజ్బుల్లాని కూడా అదుపులో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలపారు. అయితే ఎవరెన్ని చెప్పినా.. ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం అంత త్వరగా ఆపేస్తుందను కోవడం అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే గాజా యుద్ధం విరమించమని ప్రపంచదేశాలన్నీ ఒత్తిడి చేసినా.. చివరికి అమెరికా కూడా చెబుతున్నా.. ఇజ్రాయెల్ గాజా శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు చేస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో హెజ్బుల్లాను అంత ఈజీగా వదిలిపెట్టేస్తుందని ఎలా భావించాలి?..

Also Read: ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్

అందుకే దూకుడుగా ఉండే ఇజ్రాయెల్.. ఇక లెబనాన్ తో కూడా పూర్తిస్థాయి యుద్ధం చేస్తుందా? లేక లెబనాన్ వెనుక ఇరాన్ ఉండడంతో ఆలోచించి ముందడగు వేస్తుందా? అనేది త్వరలోనే తెలుస్తుంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×