EPAPER

Manu Bhaker: ‘ఆ విజయం కోసం ఆమె ఎంతో కష్టపడింది’.. మనూ భాకెర్ విజయంపై స్పందించిన రాహుల్ ద్రవిడ్..

Manu Bhaker: ‘ఆ విజయం కోసం ఆమె ఎంతో కష్టపడింది’.. మనూ భాకెర్ విజయంపై స్పందించిన రాహుల్ ద్రవిడ్..

Manu Bhaker (Today’s sports news) :  భారత క్రికెట్ జాతీయ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్.. పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన మనూ భాకెర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ఆ పతకం సాధించడానికి ఎంతగా కష్టపడిందో.. ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కిందని అన్నారు. గత టోక్యో ఒలింపిక్స్ లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుకు చేస్తూ.. మనూ భాకెర్ చూపిన ధైర్యాన్ని ద్రవిడ్ మెచ్చుకున్నారు.


మూడేళ్ల క్రితం జపాన్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో మనూ భాకెర్ కు దురదృష్టం వెంటాడింది. సరిగ్గా ఆమె పతకాన్ని చేరువలో ఉన్న సమయంలో ఆమె షూట్ చేసే గన్ సరిగా పనిచేయలేదు. దీంతో ఆమె వెనుతిరగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ద్రవిడ్ ప్రస్తావిస్తూ.. ”మనూ భాకెర్ టోక్యోలో ఎదురైన అనుభవం తరువాత ఇక షూటింగ్ క్రీడల్లో పాల్గొనకూడదనుకుంది. ఆ ఘటన తరువాత ఆమెలో ఆత్మవిశ్వాసం లోపించింది. అయితే ఆమెకు తోడుగా భాకెర్ తల్లిదండ్రులు, ఆమె కోచ్ నిలబడ్డారు. వారిచ్చిన ప్రోత్సాహం వల్లే మనూ తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. మూడేళ్ల పాటు మనూ ఎంతో కష్టపడింది, ఎంతో దీక్ష, ఏక్రగతతో మూడేళ్ల పాటు ప్రాక్టీస్ చేయడమంటే సామాన్య విషయం కాదు. ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆమెకు దక్కింది. ఆమె టోక్యో ఒలింపిక్స్ తరువాత మళ్లీ పుంజుకొని పారిస్ ఒలింపిక్స్ లో సాధించిని విజయం ఒక అద్భతం. మనూ కథ అందరికీ ఒక ఇన్సిపిరేషన్.,” అంటూ ద్రవిడ్ పారిస్ లోని ఇండియా హౌస్ ప్యానెల్ చర్చ సందర్భంలో చెప్పారు.

మనూ కథ ద్వారా ప్రభావితమై ఇండియా మరింత మంది యువత క్రీడలను తమ వృత్తిగా ఎన్నుకుంటారని అభిప్రాయపడ్డారు. మనూ భాకెర్ సాధించిన విజయం ఇండియా క్రీడల్లో చాలా పెద్దది అని ఆయన అన్నారు.


మనూ భాకెర్ ఇండియా తరపున పారిస్ ఒలింపిక్స్ పిస్టల్ షూటింగ్ కాంపెటీషన్ లో కాంస్య పతకం సాధించారు.

Also Read: తొలి పతకం సాధించిన మను భాకర్ ఎవరు? ఆమె గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Related News

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

Big Stories

×