EPAPER

Job Harassment| ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

Job Harassment| ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

Job Harassment| ఓ యువతి ఉద్యోగం కోసం ఆన్ లైన్ లో జాబ్ అప్లై చేసింది. ఆమెకు ఆ కంపెనీ మెనేజర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి యువతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమెకు తాను ఉద్యోగం ఇవ్వాలంటే.. కంపెనీ బాస్ తో ప్రతిరోజు సమయం గడపాలని ఆ మెనేజర్ మెసేజ్ చేశాడు. ‘ఆఫీసు పనితో పాటు బాస్ ఏం చేయమంటే అది చేయాలి.. ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్లాలి’ అని ప్రత్యేకంగా మెసేజ్ లో రాశాడు. ఈ మెసేజ్ చూసిన తరువాత ఆ యువతి ఆ మెనేజర్ కొంత చాటింగ్ చేసింది. ఆ తరువాత చాటింగ్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆ కంపెనీ పేరు, వివరాలు బయటపెట్టింది. ఇప్పుడామె పెట్టిన పోస్టుకు చాలా మంది నెటిజెన్లు రియాక్ట్ అవుతున్నారు.


వివరాల్లోకి వెళితే.. ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో నివసించే అదీనా హీరా (23) అనే యువతి, ఇటీవలే ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఇండీడ్’ లో ఉద్యోగం కోసం అప్లై చేసుకుంది. పాకిస్తాన్ లోని గీగా గ్రూప్ కంపెనీలో చిన్న ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ అది. గీగా గ్రూపు పాకిస్తాన్ లో ఓ పెద్ద కంపెనీ. ఆమె జాబ్ కోసం అప్లై చేయగానే సదమ్ బుఖారీ అనే వ్యక్తి తాను గీగా గ్రూప్ మెనేజర్ నని చెబుతూ.. ఆమెకు వ్యాట్సప్ ద్వారా ఒక మెసేజ్ చేశాడు. ”కంపెనీలో కొత్త వారికి ఉద్యోగాలివ్వాలనుకుంటున్నాం. ముఖ్యంగా యువతకు అవకాశమిస్తున్నాం. మీకు ఈ జాబ్ చేయడానికి ఆసక్తి ఉంటే.. ఈ జాబ్ కేవలం ఆఫీస్ వరకే పరిమితం కాదు.. బాస్ తో ఎక్కువ సమయం గడపాలి. ముఖ్యంగా ఆయనతో పర్సనల్ గా కలిసి తిరగాలి. బాస్ ను సంతోషపరుస్తూ ఉండాలి, మీరు చెప్పినట్లు చేస్తే.. మీ జీతం, ఇతర అలవెన్సులు త్వరగా పెరుగుతాయి” అని రాశాడు.

ఈ మెసేజ్ చూసిన హీరా, కోపంతో ఆ మేనేజర్ ను తిట్టింది. ఆ తరువాత అతన్ని బ్లాక్ చేసింది. ఈ ఉదంతం గురించి తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ”పాకిస్తాన్ లో ఓ మహిళగా బ్రతకడమే కష్టం. అలాంటిది ఉద్యోగం కోసం అప్లై చేస్తే.. ఇలాంటి మెసేజ్ లు చేస్తున్నారు. మరీ ఇంత దిగజారుతారా? ఇలా ఎంత మంది అమాయక అమ్మాయిల జీవితాలు నాశనం చేశారో?” అని పోస్ట్ లో రాసింది.


Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

హీరా చేసిన పోస్టుకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. చాలా మంది ఈ విషయంపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇండియా నుంచి ఓ నెటిజెన్ రాస్తూ.. ”మీ దేశంలో మహిళా కమిషన్ లేదా? వాళ్లకు వెళ్లి ఫిర్యాదు చేయండి.” అని సూచించింది. మరొక యూజర్ అయితే.. ”మీరు చాలా ధైర్యవంతురాలు.. ఇలా బహిరంగంగా దీని గురించి తెలియజేశారు.” అని రాశారు.

అయితే ఆమె పోస్ గురించి స్పందిస్తూ.. లింకెడ్ ఇన్ లో గీగా గ్రూప్ కంపెనీ అధికార ప్రతినిధి, అలాంటి మెసేజ్ లు తమ కంపెనీ నుంచి ఎవరూ చేయలేదని, అది ఎవరో తమ కంపెనీ పేరు చెప్పి ఇండీడ్ లో ఫేక్ యాడ్స్ ఇచ్చారని స్పష్టం చేశారు. ఆ ఫేక్ యాడ్స్ ఇచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గీగా గ్రూప్ లో జాబ్స్ కోసం అప్లై చేసుకోవాలంటే.. తమ అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని, జాబ్ పోర్టల్స్ ద్వారా చేయకూడదని చెప్పారు.

Also Read: ‘అయ్యో సగం తినేశానే’.. చికెన్ బర్గర్ లో పురుగు!

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×