ప్రముఖ టెక్ బ్రాండ్ హానర్ తాజాగా Honor X60i స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది

కంపెనీ Honor X60iలో అనేక శక్తివంతమైన ఫీచర్లను అందించింది. అలాగే ఇది 3 వేరియంట్‌లతో లాంచ్ అయింది.

అందులో 8GB + 256GB వేరియంట్ ధర CNY 1,399 (సుమారు రూ. 16,154)గా ఉంది.

అలాగే మిడ్ రేంజ్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ. 18,465)గా ఉంది.

టాప్ 12GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,799 (సుమారు రూ. 20,775)గా కంపెనీ నిర్ణయించింది.

ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి HD + రిజల్యూషన్‌తో శక్తివంతమైన 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం కంపెనీ ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఇచ్చింది.

సేఫ్టీ కోసం ఇది ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. అలాగే పనితీరు కోసం ఇది MediaTek డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఇది 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను పొందుతారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు శక్తినివ్వడానికి 5,000mAh బ్యాటరీ అందించబడింది.

అందువల్ల ఒక మంచి ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.