EPAPER

Honor X60i: ఈ ఫీచర్లు చూస్తే హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే కొనేస్తారు.. ధర కూడా తక్కువే..!

Honor X60i: ఈ ఫీచర్లు చూస్తే హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే కొనేస్తారు.. ధర కూడా తక్కువే..!

Honor X60i Launched In China: ప్రముఖ టెక్ బ్రాండ్ హానర్ కొత్త ఫోన్‌లను స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తరచూ రిలీజ్ చేస్తుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తన ఫోన్‌లో అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లను అందించి ఆకట్టుకుంటోంది. అయితే కంపెనీ ఇప్పుడు మరో కొత్త ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. Honor X60i పేరుతో ఓ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Honor X60i ఫోన్ గతేడాది ప్రారంభించిన Honor X50iకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. కంపెనీ Honor X60iలో అనేక శక్తివంతమైన ఫీచర్లను అందించింది. అవేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


 

Honor X60i Specifications


Honor X60i స్మార్ట్‌ఫోన్ పూర్తి HD + రిజల్యూషన్‌తో శక్తివంతమైన 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గరిష్ట ప్రకాశాన్ని 200 నిట్‌ల వరకు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఇది ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం కంపెనీ ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఇచ్చింది. కంపెనీ Honor X60i స్మార్ట్‌ఫోన్‌ను క్లౌడ్ బ్లూ, మూన్ షాడో వైట్, కోరల్ పర్పుల్, మ్యాజిక్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసింది.

Also Read: వాసివాడి తస్సాదియ్య.. డెడ్‌పూల్ ఇన్‌స్పిరేషన్‌‌తో కొత్త ఫోన్.. డిజైన్ అదుర్స్.. ధర ఎంతంటే?

ప్రాసెసర్ విషయానికొస్తే.. పనితీరు కోసం ఇది MediaTek డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 8GB RAM + 256GB, 12GB RAM + 256GB, 12GB RAM + 512GB అనే మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఇది 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను పొందుతారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు శక్తినివ్వడానికి 5,000mAh బ్యాటరీ అందించబడింది.

Honor X60i Price

Honor X60i ఫోన్‌ 3 వేరియంట్‌లతో లాంచ్ అయింది. అందులో 8GB RAM + 256GB వేరియంట్ ధర CNY 1,399 (సుమారు రూ. 16,154)గా ఉంది. అలాగే మిడ్ రేంజ్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ. 18,465), టాప్ 12GB RAM + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,799 (సుమారు రూ. 20,775)గా కంపెనీ నిర్ణయించింది.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×