EPAPER

Andhra Pradesh: అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నాం: కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని

Andhra Pradesh: అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నాం: కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని

Pemmasani Chandra Shekar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తమను సంతృప్తి పరిచిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏపీకి జరిగిన న్యాయం చాలా సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు. గత ఐదేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఎలా ఉంటాయో తెలియని దుస్థితి నెలకొందని అన్నారు. కానీ, కూటమి అధికారంలోకి రాగానే అమరావతికి రూ. 15 వేల కోట్లు, రైల్వే బడ్జెట్‌ నిధులు రావడం సంతోషదాయకమని చెప్పారు. ఈ ప్రభుత్వంో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత దేశంలో జీడీపీ రేటు పెరగడం కూడా శుభపరిణామం అని వివరించారు.


45 కోట్ల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఉద్యోగావకాశాలు వస్తాయని, రూ. 100 కోట్ల వ్యాపారాలు చేయడానికి, ఇండస్ట్రియల్ కారిడార్, గ్రామస్థాయిలో 25 వేల గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేపడుతామని వివరించారు. సోలార్ సబ్సిడీ 1 కోటి మందికి అవకాశం కల్పిస్తామని, రాబోయే రోజుల్లో రూరల్ పరిధిలో 2 కోట్ల ఇళ్లు, అర్బన్ పరిధిలో 1 కోటి ఇళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ పై ప్రధాన దృష్టి సారించారని చెప్పారు. రైతన్నలకు కావాల్సిన నూతన వంగడాల తయారీపైనా దృష్టిపెడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్ని కలిపి దాదాపు రూ.80 వేల కోట్ల నిధులు మంజూరు చేయడానికి కేంద్ర బడ్జెట్ నిర్ణయించిందని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో 56 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందే అవకాశం ఉందన్నారు.

జలజీవన్ మిషన్ పేరుతో ప్రతి ఇంటికి కుళాయి అందించే అవకాశం ఉన్నదని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని హామీ ఇచ్చారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. నరేగా నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, తాము ఆ నిధులను సద్వినియోగం చేస్తామని తెలిపారు. కేంద్రం నుంచి సత్సంబంధాలు కలిగి అమరావతి రాజధాని అభివృద్ధి క ార్యక్రమాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. గత ఐదేళ్లుగా మీడియాను సైతం దగ్గరికి రానీయకుండా.. గత ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారని వివరించారు.


Also Read: Pawan Kalyan: ఆ దర్శకుడితో పవన్ కల్యాణ్ సినిమా.. నిర్మాత క్లారిటీ.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..!

ఏపీలో 50 కోట్లతో పోస్టల్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్ బిల్డింగ్ నిర్మాణం చేపడతామని కేంద్రమంత్రి వివరించారు. అనేక ప్రైవేట్ టెలికమ్యూనికేషన్ సంస్థలు రేట్లు పెంచిన మాట వాస్తవమేనని, ఈ సందర్భంలోనే బీఎస్ఎన్ఎల్ గురించి చర్చ జరుగుతున్నదని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ వెనుకబడటానికి ప్రధానకారణం దానిపై దృష్టి పెట్టకపోవడమేనని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ టవర్స్ పెంచి పేదలకు టెలి కమ్యూనికేషన్స్ సేవలు అందిస్తామని తెలిపారు.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×