EPAPER

Yoga Asanas For Facial Fat: ఫేషియల్ ఫ్యాట్ తగ్గడానికి బెస్ట్ యోగాసనాలు ఇవే.. !

Yoga Asanas For Facial Fat: ఫేషియల్ ఫ్యాట్ తగ్గడానికి బెస్ట్ యోగాసనాలు ఇవే.. !

Yoga Asanas For Facial Fat: కాస్మోటిక్స్ ప్రొడక్ట్స్ లేకుండా అందంగా కనిపించాలనుకుంటున్నారా? సహజ అందానికే మీరు మొగ్గు చూపుతారా? అయితే మీరు కొన్ని వ్యాయామాల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. నిర్దిష్ట భంగిమలతో కూడిన ఆసనాలు ముఖ కండరాల ఒత్తిడి తగ్గించడంతో పాటు ముఖం అందంగా కనిపించేలా చేస్తాయి. ప్రాణాయామ పద్ధతులు సహా కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా మీరు సహజ సౌందర్యాన్ని పొందవచ్చు.


ఆసనాలతో ముఖం, మెడకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల ముఖంపై ఉండే కొవ్వు కరిగిపోతుంది. శరీరం కూడా శక్తివంతంగా మారడంతో పాటు మంచి షేప్‌లో కనిపించే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే చర్మం ఆరోగ్యంగా మెరిసేలా కనిపించేందుకు గాను రకరకాల ఆసనాలు చేయవచ్చు. వీటితో  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రతిరోజు ఆసనాలు చేయడం ద్వారా ఎలాంటి సౌందర్య సాధనాలు అవసరం కూడా ఉండదు. ఇలా ఆసనాలు వేయడం ద్వారా అందం రెట్టింపు అవుతుంది. మరి అలాంటి యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సిద్ధ నడక:
మానసిక ప్రయోజనాలను కలిగించే ముఖ్యమైన ఆసనాల్లో సిద్ధ నడక కూడా ఒకటి. దీన్నే ఇన్ఫినిటీ వాక్ అని కూడా పిలుస్తుంటారు. సాధారణ వాకింగ్ కంటే ఇది చాలా శక్తివంతమైంది. మంచి ఫలితాలను కూడా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేలమీద ఎనిమిది అంకెను గీసుకుని ఎనిమిది ఆకారంలో నడవాలి. సిద్ధ నడక ఇలా 20 నుంచి 30 నిమిషాల పాటు నడిచారంటే మీరు శారీరకంగా, మానసికంగా ఫిట్ అవటంతో సహా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.
పాద హస్తాసనం:
రెండు చేతులను కలిపి పాదాలను అందుకోవడమే పాదహస్తాసనం . తలను మోకాలికి అందించడం. ఈ భంగిమ చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకొని వదులుతుూ ఉండాలి. ఇది ముఖం మెడతో పాటు పూర్తి శరీరానికి రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. ముఖం అందంగా మారడానికి ఉపయోగపడుతుంది.
ధనురాసనం:
శరీరాన్ని ధనస్సు ఆకారంలో ఉండే విల్లు లాగా వంచి చేసే ఆసనమే ధనురాసనం. నేలపై బోర్లా పడుకుని వెనక్కు వంచి పాదాలను చేతులతో పట్టుకోవాలి. ఇలా 15 నుంచి 20 సెకన్ల పాటు ఉన్న తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఫలితంగా ముఖం అందంగా తయారవుతుంది.
చక్రాసనం:
ఈ ఆసనం చేసినప్పుడు శరీరం చక్రం ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీన్ని చక్రాసనం అని పిలుస్తారు . దీని కోసం ముందుగా వెల్లకిలా పడుకోవాలి. తర్వాత కాలు మడిచి చేతులను భుజాల కింద ఆనించాలి. శ్వాస పీల్చుకొని వదులుతూ నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడను కిందకు వేలాడేలా ఉంచాలి. ఈ ఆసనాన్ని 10 నుంచి 20 సెకన్ల పాటు చేయాలి.

Also Read: ఉలవలను తింటే ఎన్ని లాభాలో తెలుసా.. ఈ సమస్యలన్నీ పరార్..


హలాసనం:
వెల్లికిలా పడుకుని చేతులను నిటారుగా ఉంచాలి. మెడను 90 డిగ్రీల ఆకారంలో ఎత్తి తలపైన ప్రాంతంలో నేలపై ఆనించాలి ఇది చూడటానికి నాగలి లాగా కనిపిస్తుంది. అందుకే దీన్ని హలాసనం అని అంటారు. ఈ ఆసనం ద్వారా వెన్నుముకపై కాస్త ఒత్తిడి కలిగినప్పటికీ ముఖ కండరాలు కదలిక బాగా పెరిగి ముఖంపై ఉన్న కొవ్వు కరుగుతుంది.

Related News

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Big Stories

×