డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్‌లు రారాజు. వాల్‌నట్‌లు ఆరోగ్యానికి ప్రత్యేకమైనవి.

బాదంపప్పుల మాదిరిగానే వాల్‌నట్‌లను రాత్రంతా నానబెట్టి తినడంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఉదయాన్నే నానబెట్టిన రెండు వాల్‌నట్‌లను తినడంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.  బలమైన ఎముకలు దీనితోనే సాధ్యం.

వాల్‌నట్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.

ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వుల కారణంగా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

రోజూ రెండు వాల్‌నట్‌లు తింటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

 రోజూ వాల్‌నట్‌లను తినడంతో శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

వాల్‌నట్‌లో ఉండే ఒమేగా-3 ఒత్తిడిని దూరం చేసి మనసుకు పదును పెట్టడంలో సహాయపడుతుంది.

వాల్‌నట్స్‌ తీసుకోవడంతో మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల సహజ మూలం. ఇది స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి.

వాల్‌నట్‌లను తినడంతో ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్‌తో సహా కొన్ని క్యాన్సర్‌ల నుంచి బయటపడవచ్చు.