EPAPER

Tax Burden On Middle Class: మధ్య తరగతిపై కనికరం చూపని కేంద్రం..

Tax Burden On Middle Class: మధ్య తరగతిపై కనికరం చూపని కేంద్రం..

Tax Burden On Middle Class For FY 2024-25: పండిస్తే పన్ను.. అమ్మేస్తే పన్ను.. కొంటే పన్ను.. తింటే పన్ను.. సంపాదించిన దానిపై పన్ను.. దాచుకున్నదానిపై పన్ను.. ప్రస్తుతం పన్నుపోటు లేని వస్తువు లేదు.. రంగం లేదు.. ప్రతి దానిపై ఇప్పుడు ట్యాక్స్‌ పడుతూనే ఉండి. ఉద్యోగులు, మధ్య తరగతి నడ్డి విరుస్తూనే ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఇప్పుడు రోజురోజుకు ప్రజల్లో ఫ్రస్టేషన్‌ పెరుగుతుంది. ఇంతకీ కేంద్రం ప్రజల నుంచి ఎంత వసూలు చేస్తుంది? వాటి నుంచి తిరిగి మనకు ఏం ఇస్తుంది?


కేంద్రం ప్రజల నుంచి ట్యాక్స్‌ వసూల్ చేయడంలో ఇంగ్లండ్‌ను ఫాలో అవుతుంది. కాబట్టి.. అదే ప్రజలకు సేవలందించే విషయంలో సోమాలియాలా కూడా పనిచేయడం లేదు. నిజానికి ఈ స్టేట్‌మెంట్‌ వందశాతం నిజమని.. ఇప్పుడు దేశప్రజలంతా బలంగా నమ్ముతున్నారు. అవును కేంద్రం ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్స్‌కు.. మనకిచ్చే సేవలు, సదుపాయాలకు ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి మనదేశ ట్యాక్స్‌ గురించి చర్చించే ముందు అసలు ఇంగ్లండ్‌లో ట్యాక్స్ వసూలు ఎలా ఉంటుంది? వాటిని ఎలా ఉపయోగిస్తారు? ట్యాక్స్‌ కట్టే వారికి అక్కడ అందే స్పెషల్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది? యూకేలో ట్యాక్స్‌ విషయంలో మొత్తం నాలుగు బ్యాండ్స్ ఉంటాయి. మీ ఆదాయం 12 వేల 570 పౌండ్స్‌ వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 12 వేల 571 నుంచి 50 వేల 270 పౌండ్స్ వరకు 20 శాతం.. 50 వేల 271 నుంచి లక్షా 25 వేల 140 పౌండ్స్ వరకు 40 శాతం.. ఆదాయం లక్షా 25 వేల 140 పౌండ్స్ దాఇతో 45 శాతం ట్యాక్స్ విధిస్తారు.

నెంబర్స్ భారీగానే ఉన్నాయి కదా.. మరి వ్యాట్ ఉండదా? అంటే ఉంటుంది. వ్యాట్ విషయానికి వస్తే స్టాండర్డ్ రేట్ 20 శాతం ఉంటుంది.. దాదాపుగా అన్ని గూడ్స్‌పై ఇదే రేంజ్‌లో వ్యాట్ ఉంటుంది. కానీ కొన్ని గూడ్స్‌ అండ్ సర్వీస్‌ అంటే చిల్డ్రన్స్‌ కార్‌ సీట్స్.. హోమ్ ఎనర్జీ లాంటి వాటికి మాత్రం 5 శాతం వ్యాట్ మాత్రమే ఉంటుంది. ఇక ఫుడ్‌, చిన్న పిల్లల దుస్తులపై ఎలాంటి వ్యాట్ ఉండదు. యూకేలో ట్యాక్స్‌ పే చేసే వారికి కాస్త స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటుందనే చెప్పాలి. ట్యాక్స్‌ కట్టే ప్రతి వారికి నేషనల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వీరికి ట్రీట్‌మెంట్‌ దాదాపుగా ఫ్రీగా ఉంటుంది. అంటే వారికి అందే సదుపాయాల గురించి అయితే చెప్పనవసరం లేదు.. సరైన రోడ్ల నుంచి మొదలు పెడితే.. ప్రతి వ్యవస్థ జవాబుదారీగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే రెస్పాన్స్‌ ఉంటుంది.


ప్రజలు అధికారులను నిలదీసేలా ఉంటుంది. ఇది యూకే ట్యాక్సేషన్‌.. ఇక ఇండియా విషయానికి వద్దాం.. ఇండియాలో పన్ను వసూలు ఎలా ఉంది? నిజానికి ఉద్యోగాలు చేసే వారికి పన్ను పోటు మాములుగా ఉండదు. మాములుగా జీతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ ట్యాక్స్‌ పేరుతో 200 చెల్లించాల్సిందే. కాబట్టి.. పన్ను కట్టే మనం సాలరీ తీసుకుంటున్నాం. కానీ ఆ సాలరీపై కూడా మళ్లీ పన్ను విధిస్తున్నారు. ఆ తర్వాత 3 లక్షల వరకు ఎలాంటి టాక్స్ లేదు. మూడు నుంచి ఏడు లక్షల వరకు 5 శాతం. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10 శాతం..10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం. 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఇది కొత్త పన్ను విధానం.. ఇక పాత పన్ను విధానం అని మరోకటి ఉంది. పోనీ ఇక్కడితో అయినా ఆగిందా? అంటే అస్సలు ఆగలేదు.

ఇన్ని టాక్స్‌లు కట్టిన తర్వాతైనా పోనీ మిగిలిన డబ్బులతో అయినా నచ్చింది ఏదైనా పర్చేస్ చేద్దామా అంటే మళ్లీ పన్ను కట్టాల్సిందే.. వన్‌ నేషన్‌.. వన్ ట్యాక్స్‌ కింద GST తీసుకొచ్చారు. ఏ వస్తువు కొన్నా పన్ను కొట్టాల్సిందే.. ఏమైనా వండుకోవాలని వస్తువులు కొన్నా వాటిపై ట్యాక్స్‌ కట్టాల్సిందే. లేదా హోటల్‌కు వెళ్లి ఏమైనా తినాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. మళ్లీ వీటన్నింటిపై అంటే టోటల్‌ బిల్లుపై మళ్లీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇలా తుమ్మినా ట్యాక్సే.. దగ్గినా ట్యాక్సే.. అంటే హాస్పిటల్‌కు వెళ్లినా మీకు పన్ను పోటు తప్పదని సింబాలిక్‌గా చెప్తున్నా మెడిసిన్‌పై ట్యాక్స్‌.. ఐసీయూలో ఉంటే సపరేట్‌ ట్యాక్స్‌.. జనరల్‌ వార్డులోఉంటే మరో రకం ట్యాక్స్.. ఇలా ప్రతి అడుగు ట్యాక్స్‌తో అవినాభవ సంబంధం మనది.

Also Read: ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ముర్ము.. పూర్తి జాబితా ఇదే

ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఈ పన్ను పోటు మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకే ఎక్కువగా పడుతుంటుంది. ఎందుకంటే సంపన్నులు, ఇండస్ట్రీయలిస్ట్‌లకు భారీ రాయితీలు ఉంటాయి. తీసుకున్న అప్పులు చెల్లించకపోయినా వాటిని రైట్‌ ఆఫ్‌ చేస్తున్నారు. ఇక పేద వర్గానికి అనేక రాయితీలు ఎలాగూ ఉండనే ఉంటాయి. అంటే ఇక్కడ వారికి ఇవ్వడం తప్పని అనడం లేదు. కానీ ఈ రెండింటి మధ్య నలిగిపోయేది మాత్రం మధ్యతరగతి వారే అనేది ఇక్కడ పాయింట్. మరి ఇంతా కష్టపడి.. నలిగిపోయి కేంద్రానికి రక్తం ధారపోస్తుంటే.. వారికి కలిగే మేలు ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. హాస్పిటల్స్‌లో ఏమైనా ఫ్రీ ట్రీట్‌మెంట్‌ ఉంటుందా? అంటే అదీ లేదు. మళ్లీ పాలసీలు కట్టాలి.. ప్రీమియంలు చేయాలి..
మళ్లీ వాటిపై పన్నులు కట్టాల్సిందే.రోడ్లు సరిగా ఉంటాయా అంటే అదీ లేదు.

పోనీ బాగున్న రోడ్లు అంటే హైవేలపై వెళ్తే మళ్లీ టోల్ కట్టాల్సిందే. ఇక సేవలు ఏమైనా సరిగా అందుతాయా? అంటే దీనికి ఆన్సర్స్ మీకే తెలుసు. రీసెంట్ బడ్జెట్‌ చూశాక కామన్‌ పీపుల్‌.. ఎస్పెషల్ ఉద్యోగుల్లో కాస్త ఫ్రస్టేషన్ పెరిగింది. ఇదైతే వాస్తవం.. పెరిగిన జీతం పన్ను చెల్లించేందుకే వెళ్లిపోతుందన్న ఫైర్ కనిపిస్తోంది. ఇలాంటి టైమ్‌లో అసలు ట్యాక్స్‌ పడకుండా ఉండేందుకు ఓ సగటు ఉద్యోగి ఓ చిట్కా చెప్పాడు.

ఆఫీస్‌ వాళ్లకు జీతం వద్దని చెప్పండి.. ఆ తర్వాత కాస్త గడ్డి పెంచండి. ఆ గడ్డిని మీ ఆఫీస్‌ వాళ్లకి అమ్మినట్టు బిల్లు క్రియేట్ చేసి.. మీ జీతాన్ని ఎలాంటి ట్యాక్స్‌ లేకుండా తీసుకోండి అని చెప్తున్నాడు ఓ సగటు ఉద్యోగి. చూడటానికి ఫన్నీగా అనిపించినా.. ఇది తనలోని ఫ్రస్టేషన్‌ను బయటపెడుతోంది. ఇప్పటికైనా కేంద్రం ఇలా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులపై తన పన్ను కత్తిని దూయడం ఆపాలన్నదే వారి డిమాండ్.. ఆలోచన.. ఆవేదన.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×