EPAPER

Suryakumar Yadav: రికార్డులు కాదు.. గెలుపే శాశ్వతం: సూర్యకుమార్

Suryakumar Yadav: రికార్డులు కాదు.. గెలుపే శాశ్వతం: సూర్యకుమార్

Suryakumar Yadav equals THIS Virat Kohli’s record during Ind vs SL1st T20I Match: శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియా తొలి టీ 20 మ్యాచ్ గెలిచి ముందడుగు వేసింది. అధికారిక కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కి తొలి విజయం అని చెప్పాలి. అలాగే కోచ్ గౌతంగంభీర్ కూడా విజయంతోనే మొదలుపెట్టాడు. ఇలా ఎన్నో శుభ పరిణామాల మధ్య.. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.


కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా శ్రీలంక పర్యటనకు వచ్చాడు. ఇక తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇలా ఈ అవార్డును ఇప్పటివరకు 15 సార్లు అందుకున్నాడు. అలా విరాట్ కొహ్లీ సరసన నిలిచాడు.

అయితే విరాట్ కి, 125 మ్యాచ్ పడితే, సూర్యకుమార్ మాత్రం 69 మ్యాచ్ ల్లోనే అందుకున్నాడు. అలా అత్యంత వేగంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. వీరి మధ్యలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కూడా ఉన్నాడు. తను 91 మ్యాచ్ ల్లో 15 సార్లు.. ఈ అవార్డు అందుకున్నాడు.


ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ రికార్డుల కోసం నేనెప్పుడూ ఆడనని అన్నాడు. అసలు వాటిగురించే ఆలోచించనని అన్నాడు. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆదర్శమని అన్నాడు. జట్టు కోసం, జట్టు గెలుపు కోసం మాత్రమే ఆడాలని భావిస్తానని తెలిపాడు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని కూడా చూసి నేర్చుకున్నానని తెలిపాడు.

Also Read: పారా ఒలింపిక్స్.. పీవీ సింధు విజయం

ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతానని అన్నాడు. ఇప్పుడిదే రికార్డు ఇంతకుముందు ఇద్దరి పేరున ఉండేది. ఇప్పుడు నేను వచ్చాను. నా తర్వాత మరొకరు వస్తారు కదా.. కాలం ఎప్పుడూ ఒక దగ్గర ఆగిపోదు. రికార్డులు కూడా ఒకరి దగ్గరే ఆగిపోవు.. అని అన్నాడు. నిలకడలేని రికార్డుల కోసం ఆడటం, పాకులాడటం వృధా అని తెలిపాడు. ఒకప్పుడు ఆ ట్రెండ్ నడిచేది, ఇప్పుడు ట్రెండ్ మారిందని అన్నాడు.

నా ఉద్దేశం ఏమిటంటే.. పోయే రికార్డుల కోసం పాకులాడేకన్నా.. మ్యాచ్ ని గెలిపించడంలోనే ఎక్కువ ఆనందం ఉందని అన్నాడు. ఇదే చిరస్మరణీయంగా మన మనసులో, రికార్డుల్లో గెలిచినట్టుగా ఉంటుందని తెలిపాడు. గౌతంగంభీర్ ఆధ్వర్యంలో ముందుకు సాగిపోతామని అన్నాడు. ఆయనతో నాకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని అన్నాడు. అదిప్పటికి కొనసాగుతోందని అన్నాడు. మున్ముందు భారత క్రికెట్ లో కొత్త అధ్యాయం మొదలు కానుందని తెలిపాడు.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×