EPAPER

President Appoints New Governors| ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ముర్ము.. పూర్తి జాబితా ఇదే

President Appoints New Governors| ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ముర్ము.. పూర్తి జాబితా ఇదే

President Appoints New Governors| భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాలకు గవర్నర్లు నియమిస్తూ.. శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఆరుగురు కొత్త గవర్నర్లు ఉండగా.. మరికొందరికి ట్రాన్స్ ఫర్ జరిగింది.


గవర్నర్ నియామకాల జాబితా:

1. రాజస్థాన్ గవర్నర్ గా హరిభావు కిసన్ రావ్ బాగ్డే
2. తెలంగాణ గవర్నర్ గా జిష్టు దేవ్ వర్మ
3. సిక్కిమ్ గవర్నర్ గా ఓం ప్రకాశ్ మాథుర్
4. ఝార్ ఖండ్ గవర్నర్ గా సంతోష్ కుమార్ గంగ్ వార్
5. ఛత్తీస్ గడ్ గవర్నర్‌గా రామెన్ దేఖా
6. మేఘాలయ గవర్నర్ గా సిహెచ్ విజయశంకర్
7. మహారాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాక్రిష్ణన్
8. పంజాబ్ గవర్నర్, చండీగడ్ అడిషనల్ గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా
9. అస్సాం గవర్నర్, మణిపూర్ అడిషనల్ గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య

పంజాబ్, చండీగడ్ గవర్నర్ గా ఇంతకాలం పనిచేసిన పురోహిత్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో గులాబ్ చంద్ కటారియాను నియమించారు. అంతకుముందు కటారియా అస్సాం గవర్నర్ పదవిలో ఉన్నారు. ఇప్పుడు కటారియా స్థానంలో అస్సాం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులయ్యారు. మణిపూర్ గవర్నర్ పదవికి గత ఫిబ్రవరిలో అనుసుఇయా ఊక్యే రాజీనామా చేయడంతో.. ఆచార్యకే ఆ బాధ్యతలు కూడా అప్పగించారు.


సిక్కిమ్ గవర్నర్‌గా నియమించబడ్డ ఓం ప్రకాశ్ మాథుర్ ఒక సీనియర్ బిజేపీ నాయకుడు. ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన సిపి రాధాక్రిష్ణన్ కు మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఇప్పడు ఝార్ఖండ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా మాజీ కేంద్ర లేబర్ మంత్రి సంతోష్ కుమార్ గంగ వార్ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉపముఖ్యమంత్రి జిష్ణు దేవ్ శర్మ్ తెలంగాణ గవర్నర్ గా రానున్నారు.

ప్రధాని మోదీ నమ్మినబంటుగా పేరొందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కె కైలాశనాథన్.. పుదుచ్చేరి గవర్నర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు ఆయన పదేళ్లపాటు గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్ కు ప్రిన్సిపాల్ చీఫ్ సెక్రటరీ గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×