EPAPER

Paris Olympics 2024: కిమ్ తో పెట్టుకుంటే అయిపోయేవారు.. ఒలింపిక్ కమిటీపై నెట్టింట జోక్స్

Paris Olympics 2024: కిమ్ తో పెట్టుకుంటే అయిపోయేవారు.. ఒలింపిక్ కమిటీపై నెట్టింట జోక్స్

IOC apologises to South Korea over Paris Olympics 2024 Ceremony Gaffe: పారిస్ ఒలింపిక్స్ ఆరంభంలోనే అపశృతి దొర్లింది. క్రీడాకారుల పరేడ్ లో దక్షిణ కొరియా పేరును అనుకోకుండా ఉత్తర కొరియా అధికార నామంతో చదివేశారు. దీంతో జరిగిన పొరపాటుకు చింతిస్తూ ఒలింపిక్స్ కమిటీ ఆ దేశానికి క్షమాపణలు కోరింది. ఇంతకీ ఆ పొరపాటు ఏమిటంటే…ఆ దేశాన్ని పరిచయం చేస్తూ డెమోక్రటిక్ పీపుల్స్ ఆఫ్ కొరియా అని తెలిపారు. అది నిజానికి ఉత్తరకొరియా అధికారిక నామం. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే దక్షిణ కొరియా అని అర్థం.


ఈ ఘటన నేపథ్యంలో నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఎక్కడా లేనట్టు 206 దేశాల్లో ఉండగా, ఒలింపిక్ కమిటీ సరాసరి వెళ్లి కిమ్ తోనే పెట్టుకుంది. పొరపాటున దక్షిణ కొరియా పేరును ఉత్తర కొరియాగా చదివారు కాబట్టి బతికిపోయారు. అదే కిమ్ దేశాన్ని అలా చది వి ఉంటే, పరిస్థితి ఏమిటి? అంటున్నారు. ఈపాటికి పెద్ద మిసైల్ ను పారిస్ ఒలింపిక్స్ పై గురి పెట్టేవాడని కామెంట్లు పెడుతున్నారు.

ఎప్పటినుంచో ఉత్తర కొరియా, దక్షిణా కొరియా రెండు దేశాల మధ్య ఉప్పు-నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా సింగర్స్ పాటలు విన్నందుకే ఒక యువకుడిని ఉరి తీసేశారు. రెండు దేశాల మధ్య అంతటి విద్వేషాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఆ దేశాల పేర్లు తప్పు చదివి కొరివితో తలగోక్కున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.


Also Read: ఒలింపిక్స్ లో.. గురి తప్పిన షూటర్లు 

అయితే, జరిగిన పొరపాటును దక్షిణ కొరియా పెద్ద మనసుతో మన్నించింది. కానీ విషయాన్ని ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాక్ కి చెబుతామని, ఒక సమావేశం ఏర్పాటు చేయాలని దక్షిణకొరియా క్రీడాశాఖా మంత్రి కోరారు. అలాగే ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. దీనిని ఫిర్యాదులతో ఆపేస్తామని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

Related News

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

Big Stories

×