EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి లాభాల రూపంలో ధనప్రవాహం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి లాభాల రూపంలో ధనప్రవాహం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం పన్నెండు రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.? ఏ రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు వరిస్తాయి. ఉద్యోగస్తులకు శుభసమయం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయంలో పురోగతి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గోసేవ చేస్తే బాగుంటుంది.

వృషభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఇతరులను నమ్మకపోవడం ఉత్తమం. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉంటుంది. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.


మిథునం:
మిథునం రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పనులను సకాలంలో పూర్తి చేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వృత్తి, వ్యాపారంలో పనులపై అంకితభావంతో ఉండాలి. ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు తీపుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదవాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగులు గొప్ప విజయాలను అందుకుంటారు. కీలకమైన పనుల విషయమై పెద్దల సలహాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. తొందరపడకుండా ఆలోచించి పనులు చేస్తే మంచిది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడి లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం చదవడం శ్రేయస్కరం.

కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

తుల:
తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారులకు విపరీతమైన ధనప్రవాహం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు ఊహించని ఆదాయం వరిస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు చేస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెద్దల సలహాలు విజయానికి లాభం చేకూరుతాయి. సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం పారాయణ మంచిది.

మకరం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యం వేధిస్తుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు అధిక ధనలాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మంచిది. గణపతిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు స్థిరమైన బుద్ధితో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. సకాలంలో సహాయం పొందుతారు. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన చేయడం మంచిది.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×