EPAPER

Bhatti Serious on BRS: మా గ్యారంటీల సంగతి సరే.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది..? : భట్టి

Bhatti Serious on BRS: మా గ్యారంటీల సంగతి సరే.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది..? : భట్టి

Bhatti Serious on BRS: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ లో అంకెల గారడీ ఏమీలేదు. బీఆర్ఎస్ నేతలు బడ్జెట్ పై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారు. మా గ్యారంటీల సంగతి సరే.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది..?. వ్యవసాయం కోసం రూ. 72 వేల కోట్లు కేటాయించడం తప్పా? హైదరబాదాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు కేటాయించడం తప్పా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదేళ్లైపోయినట్టుగా మాపై విమర్శలు చేస్తున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. గ్యారెంటీల అమలు కోసం అనుక్షణం పని చేస్తున్నాం. మా ప్రభుత్వం రాగానే ఉచిత బస్సు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రాబోయే 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక్క స్కిల్ యూనివర్సిటీకి రూపకల్పన చేశాం. స్పష్టమైన విద్యుత్ పాలసీ తీసుకురాబోతున్నాం.


Also Read: కాంగ్రెస్‌లోకి వచ్చేయ్.. సీఎం బంపరాఫర్.. నన్ను వదిలేయండన్న ఒవైసీ

గతంలో అనర్హులకు రూ. వేల కోట్లు రైతుబంధు ఇచ్చారు. రైతు భరోసాపై విధివిధానాలపై ఆలోచనలు చేస్తున్నాం. ప్రజాధనం వృథా కావొద్దనే.. రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ. ఎస్సీ, ఎస్టీల కోసం రూ. 17 వేల 56 కోట్లు కేటాయించాం. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాం. ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టివ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ప్రతీ నియోజకవర్గంలో అంబేద్కర్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. మూడు నెలలు ఎన్నిక కోడ్ తోనే సరిపోయింది. 4 నెలల్లోనే 65 వేలకు పైగా ఉద్యోగాలిచ్చిన ఘనత మాది. అడ్డగోలు నియమాలతో ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం భారీగా పెంచుకుంది. సహేతుక పద్ధతిలో ఎక్సైజ్ ఆదాయం 5 శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్చి 1 నుంచే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ఇస్తున్నాం. 2035 వరకు విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేశాం. తెలంగాణ విద్యావిధానం దేశానికే ఆదర్శం కాబోతున్నది. దేశం గర్వించేలా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తాం’ అంటూ భట్టి పేర్కొన్నారు.


Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×