EPAPER

Vizag Steel Plant: సంబరాలు చేసుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. కారణమేమంటే..?

Vizag Steel Plant: సంబరాలు చేసుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. కారణమేమంటే..?

Vizag Steel plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో కార్మికులు, ఎంప్లాయిస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ కీలక ప్రకటన చేసింది. వంద మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు తెలిపింది. విశాఖ ఉక్కు పరిశ్రమ 1990 నవంబర్ లో ఉత్పత్తిని ప్రారంభించగా, నేటి వరకు 100 మిలియన్ టన్నుల మైలు రాయిని అధిగమించినట్లు యాజమాన్యం తాజాగా పేర్కొన్నది. ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా, ముడిసరుకు కొరత కారణంగా 2,3 బ్లాకఫర్నేస్ లు మాత్రమే పనిచేస్తున్న విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి కుమారస్వామి ఇటీవలే ఈ కర్మాగారాన్ని సందర్శించి, అన్ని విభాగాలను పరిశీలించారు. సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. కర్మాగారం 100 మిలయన్ టన్నుల రికార్డును సాధించడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు ఉద్యోగులు, కార్మికులు.


Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×