EPAPER

Modi Warning To Pakistan: వరల్డ్ మ్యాప్‌లో లేకుండా చేస్తా.. పాకిస్తాన్‌కి మోదీ వార్నింగ్

Modi Warning To Pakistan: వరల్డ్ మ్యాప్‌లో లేకుండా చేస్తా.. పాకిస్తాన్‌కి మోదీ వార్నింగ్

PM Narendra Modi Warning To Pakistan: కార్గిల్ యుద్ధం ఓడిపోయినా పాకిస్థాన్‌కు బుద్ధి రాలేదన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. అందుకే, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని మరింతగా రెచ్చగొడుతోంది. ఇదే అంశాన్ని కార్గిల్ విజయ్ దివస్‌లో ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఇక, ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే.. కార్గిల్ తర్వాత మరో యుద్ధం తప్పదా..? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. దానికి పాక్ ఆక్రమిత కాశ్మీరే కేంద్రంగా మారుతుందా అనే అనుమానాలున్నాయి.


స్వాతంత్రం వచ్చిన రెండు నెలల నుండే భారత్, పాకిస్థాన్‌ల మధ్య కశ్మీర్‌ విషయంలో ఎడతెగని వివాదం నడుస్తూనే ఉంది. కార్గిల్ యుద్ధం కూడా అందులో భాగమే అయినప్పటకీ, యుద్ధానికి ప్రధాన కారణం మాత్రం నాటి పాకిస్థాన్ సైనికాధికారి జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ అని చెప్పాలి. లాహోర్ సమ్మిట్ తర్వాత పాకిస్తాన్ సైనికులు గుట్టుచప్పుడు కాకుండా కార్గిల్ పర్వతాలపైకి వెళ్లి కూచోవడం వెనుక అసలు లక్ష్యం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు.. భారతదేశానికి ఉత్తరంగా సుదూరంగా ఉన్న టిప్‌పై సియాచిన్ గ్లేసియర్‌కు లైఫ్ లైన్‌గా ఉన్న జాతీయ రహదారి 1-Dని ఎలాగోలా ఆక్రమించి, తమ అదుపులోకి తెచ్చుకోవడమేనని తెలుస్తోంది.

దీనితో, లడఖ్ వైపు సరుకులు రవాణా చేసే వాహనాల కదలికలను అడ్డుకుని, భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో సియాచిన్‌ను వదులుకునేలా చేయాలన్నదే ముషారఫ్ ప్లాన్. అయితే, ముషారఫ్ ఇంత కక్ష్య పెంచుకోడానికి కారణం… 1984లో సియాచిన్‌పై భారత్ పట్టు సాధించడం. అది ముషారఫ్‌కు చాలా అవమానంగా అనిపించింది. అప్పట్లో ముషారఫ్ పాకిస్తాన్ కమాండర్ ఫోర్స్‌లో మేజర్‌గా ఉండేవారు. ఆయన చాలాసార్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. కానీ అందులో సక్సెస్ కాలేకపోయారు. అందుకే, భారత్‌కు భారీ షాక్ ఇవ్వడానికి ముషారఫ్ అప్పటి నుండి వేచి చూశాడు. పాకిస్థాన్‌ సైనికాధికారి అయన తర్వాత ఈ ప్లాన్‌ను పక్కా అమలు చేశాడు. ఎంతగా అంటే, కార్గిల్‌లోని ఎత్తైన కొండలను పాకిస్థాన్ సైనికులు ఆక్రమించే వరకూ భారత్ నిఘా వ్యవస్థ కూడా దాన్ని కనుక్కోలేకపోయింది.


అందుకే, పాకిస్థాన్ సైనికులు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లి, ఖాళీగా ఉన్న ఒక పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించారు. లేహ్-కార్గిల్ రహదారిపై పూర్తి పట్టు సాధించారు. అది వాళ్లు సాధించిన చాలా పెద్ద విజయం కూడా. నిజానికి, పాకిస్థాన్ సైన్యం ఉన్నది కొద్ది మందే అయినా.. వారికి పదింతల సైన్యాన్ని భారత్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే, కార్గిల్ యుద్ధం ఓడిపోయిన తర్వాత కూడా పాకిస్థాన్ పద్ధతిలో మార్పు రాలేదు. అంతెందుకు, భారత్, పాకిస్తాన్‌లు విడిపోయిన రెండు నెలల్లోనే ఈ రెండు దేశాల మధ్య కశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది. 1947 తర్వాత.. 1965లో కశ్మీర్‌పై రెండు దేశాలూ యుద్ధానికి దిగాయి.

Also Read: సొంత కొడుకునే దత్తత తీసుకునేందుకు అనుమతి కోరిన మహిళ.. సుప్రీం కోర్టులో విచిత్ర కేసు

1971లో కూడా తూర్పు పాకిస్తాన్‌‌గా పేరున్న ప్రస్తుత బంగ్లాదేశ్‌లో పాక్ పరిపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల పోరాటానికి మద్దతునిచ్చి, స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు భారత్ సహకరించింది. ఇందులో భాగంగా… పాకిస్తాన్ భూభాగంలో భారత వాయుసేన వైమానిక దాడులు నిర్వహించింది. బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఈ యుద్ధం ముగిసింది. ఇక, 1989లో కశ్మీర్‌ లోయలో భారతదేశ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరు మొదలైంది. తర్వాత, 1999లో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌తో శాంతి ఒప్పందం చేసుకుందామనే ఆలోచనతో లాహార్‌కు బస్సుయాత్ర చేసి, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సమావేశయ్యారు.

లాహుర్ బస్సు యాత్ర విజయవంతమైనప్పటికీ ముషారఫ్ బుద్ధి మాత్రం మారలేదు… మే 1999లో కార్గిల్‌లో యుద్ధానికి కారణమయ్యాడు. అది ఓడిపోవడంతో… ఏకంగా ప్రజలు ఎన్నుకున్న పాకిస్థాన్ ప్రభుత్వాన్నే దించేసి, తాను అధ్యక్షుడయ్యాడు. అప్పటికీ, భారత్ శాంతి కోసం పాకులాడింది. కార్గిల్ యుద్ధం ముగిసిన సరిగ్గా రెండేళ్ల తర్వాత… 2001 మే నెలలో భారత ప్రధాని వాజ్‌పేయి, పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆగ్రాలో సమావేశమయ్యారు. అయితే, ఎలాంటి ఒప్పందం జరగకుండానే ఆ సమావేశం ముగిసింది. ఇక, అక్టోబర్ 2001లో శ్రీనగర్‌లోని కశ్మీర్ అసెంబ్లీపై జరిగిన దాడిలో 38 మంది చనిపోయారు. అదే ఏడాది డిసెంబరు 13న, భారత పార్లమెంటుపై జరిగిన దాడిలో 14 మంది చనిపోయారు.

మరో ఆరేళ్ల తర్వాత, 2007లో… పాకిస్తాన్, భారత్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలుపై జరిగిన బాంబు దాడిలో 68 మంది మరణించారు. తర్వాతి సంవత్సరం 2008లో.. ముంబయి రైల్వే స్టేషన్, హోటల్‌, ఓ సాంస్కృతిక కేంద్రంపై 60 గంటలపాటు జరిగిన మిలిటెంట్ దాడిలో 166 మంది చనిపోయారు. అప్పటి నుండీ పాకిస్థాన్ తన ప్లాన్ మార్చింది. అంతర్జాతీయంగా తీవ్రవాదులను పోషించే దేశంగా పేరుపొందిన పాకిస్థాన్.. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. భారత ఆర్మీ లక్ష్యంగా దాడులు చేయడం ప్రారంభించింది. 2016లో పఠాన్‌కోట్‌లోని భారత వాయుసేన శిబిరంపై జరిగిన దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. అదే సంత్సరం సెప్టెంబర్‌‌లో.. కశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో 19 మంది సైనికులు మరణించారు.

ఇక, అది జరిగిన కొన్ని రోజుల్లోనే.. పాక్ పాలిత కశ్మీర్లోని మిలిటెంట్ శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించినట్లు భారత్ ప్రకటించింది. అయితే దీన్ని పాకిస్థాన్ తోసిపుచ్చింది. ఇక, 2019లో కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన మిలిటెంట్ ఆత్మాహుతిదాడిలో 40కి పైగా జవాన్లు మరణించారు. దానితో… పాకిస్తాన్‌లోని కశ్మీరీ మిలిటెంట్ శిబిరాలపై వైమానిక దాడులు చేసినట్లు, శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది. తర్వాత, పాక్ ఉగ్రవాదం కశ్మీర్‌లో అశాంతిని పెంచడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల, కశ్మీర్‌లో జరుగుతున్న దాడులు కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి.

Also Read: నీతి ఆయోగ్ మీటింగ్.. సీఎం నితీష్ డ్రాప్, ఎన్డీయేలో ఏం జరుగుతోంది?

అందుకే, కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ప్రధాని మోడీ, పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘పాక్ దుర్మార్గపు చర్యలు, వికృత ప్రయత్నాలు అన్ని సందర్భాల్లోనూ విఫలమయ్యాయనీ.. అయినా దానికి బుద్దిరాలేదని అన్నారు. చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు.. ఉగ్రవాదం, సరిహద్దుల్లో దొంగ యుద్దాలతో కవ్వింపు చర్యలకు తెగబడుతూనే ఉందన్నారు. పాక్‌ సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఈ రోజు నేను మాట్లాడేది ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి నేరుగా వినబడతాయి. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. వారి కుట్రలు ఎప్పటికీ ఫలించవు. భారత సైన్యాలు ఉగ్రవాదాన్ని నలిపేసి.. శత్రువులకు తగిన బుద్దిచెబుతాయి’ అని మోడీ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు.

అయితే, మోడీ 3.0లో పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారంలో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు కూడా ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ అంశాన్నే పదే పదే ప్రస్తావించారు. పీఓకే భారతదేశంలో భాగమనీ, దాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాబోయే కశ్మీర్ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ స్థానాలను పీఓకేకి కేటాయించినట్లు కూడా గతంలో అమిత్ షా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు.

ప్రధాని మోడీ గత రెండు పర్యాయాల్లో బీజేపీ సిద్ధాంతాలకు సంబంధించిన లక్ష్యాలను దాదాపుగా పూర్తి చేశారనే చెప్పాలి. ఇక, మూడో సారి వచ్చిన ఈ పదవీ కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైన దృష్టి పెట్టే ఛాన్స్ కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. వివాదాస్పదమైన కాశ్మీర్ భూభాగంలోని కార్గిల్ సెక్టార్‌లో దాదాపు మూడు నెలల పాటు భారత్, పాకిస్థాన్‌లు చేసిన కార్గిల్ యుద్ధం తర్వాత.. బహుశా పీఓకే అంశంలో మరోసారి యుద్ధం తప్పదా? అనే ప్రశ్న ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రెండు అణు శక్తుల మధ్య జరిగిన మొదటి నిజమైన హాట్ వార్, కార్గిల్ యుద్ధం తర్వాత.. మరో యుద్ధం ఏదైనా జరిగితే అది ఇరు దేశాల్లో కోలుకోలేని నష్టాలకు దారితీస్తుదనడంలో సందేహం లేదు. అయితే, ఆపరేషన్ కశ్మీర్‌లో భాగంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య ఈ సమస్యకు పరిష్కారం మాత్రం అంత సులువు కాదని అర్థమవుతుంది. ఇక, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.

Related News

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

India-Canada Crisis: ఆ దేశాల టార్గెట్ భారత్ పతనం.. అదే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా?

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

South Korea Vs North Korea: యుద్దంలోకి కిమ్.. కొరియా అల్లకల్లోలం కానుందా..?

TDP VS Janasena: భగ్గుమన్న నిడదవోలు.. కూటమిలో కొట్లాట?

MP Bharath Vs Ganta Srinivasa Rao: బాలకృష్ణ చిన్నల్లుడికి గంటా షాక్.. అసలు కథ ఇదే

Big Stories

×