EPAPER

Biological Mother Adopts Son| సొంత కొడుకునే దత్తత తీసుకునేందుకు అనుమతి కోరిన మహిళ.. సుప్రీం కోర్టులో విచిత్ర కేసు

Biological Mother Adopts Son| సొంత కొడుకునే దత్తత తీసుకునేందుకు అనుమతి కోరిన మహిళ.. సుప్రీం కోర్టులో విచిత్ర కేసు

Biological Mother Adopts Son| ఒక మహిళ తనకే పుట్టిన మగ సంతానాన్ని దత్తత తీసుకునేందుకు అనుమతులు కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. అయితే పిల్లాడి తండ్రి అందుకు ఒప్పుకోవడం లేదని.. అతని అనుమతి అవసరం లేదని ఆమె వాదన. ఈ వింత కేసు వివరాలు తెలుసుకొని న్యాయమూర్తులు సైతం ఆశ్చర్యపోయారు.


కేసు వివరాల్లోకి వెళితే.. జ్యోతి సింగ్ అనే మహిళ ది హిందు అడాప్షన్స్ అండ్ మెయిన్టెన్స్ చట్టం 1956 సెక్షన్ 9(2) ప్రకారం బిడ్డను దత్తత తీసుకునేందుకు అనుమతులు కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. జ్యోతి సింగ్ 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ గర్భవతిగా ఉన్న సమయంలోనే భర్త ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తరువాత నుంచి ఎప్పుడూ తిరిగి రాలేదు. దీంతో ఆమె 2018లో అతనితో విడాకులు తీసుకొని.. 2020లో మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే పిల్లాడు తనతో ఉన్నా.. కొంతకాలం క్రితం తనకు పుట్టిన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని ఆమె మాజీ భర్త కోర్టు నోటీసులు పంపాడు.

నిజాని ఆమె మాజీ భర్త స్వయాన తన సోదరుడి భార్య(భర్త వదిన)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. అందకే గర్భవతిగా ఉన్న తనను వదిలేసి ఆమెతో వెళ్లిపోయాడని చెప్పింది. తన భర్త వదినకు ఇంతకుముందు వివాహంతో ఒక కూతురు కూడా ఉంది. ఇప్పుడు వాళ్లిద్దరూ సహజీవనం చేస్తూ.. మరో బిడ్డకు జన్మనిచ్చారని తెలపింది.


Also Read: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు

ఇంత జరిగాక తాను కూడా 2020లో మరో వివాహం చేసుకున్నానని.. తన రెండో భర్త చాలా మంచి వ్యక్తి అని తెలుపుతూ.. తనకు మొదటి వివాహం వల్ల పుట్టిన కొడుకుని మంచి విలువలతో పెంచి పోషిస్తామని కోర్టులో తన వాదన వినిపించింది. అందుకుగాను తనకు భారత హిందూ దత్తత చట్టం.. ది హిందు అడాప్షన్స్ అండ్ మెయిన్టెన్స్ చట్టం 1956 సెక్షన్ 9(2) ప్రకారం దత్తత ఇవ్వాల్సిందిగా కోర్టును కోరింది. అయితే తాను దత్తత తీసుకునేందుకు తన మాజీ భర్త అనుమతులు అవసరం లేదని కూడా వాదించింది.

జ్యోతి సింగ్ వాదన మొత్తం విన్న సప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఆమె నేరుగా బిడ్డ కస్టడీ కోరకుండా దత్తత తీసుకుంటానని వాదించడం వింతగా ఉందని తెలిపింది. ది హిందు అడాప్షన్స్ అండ్ మెయిన్టెన్స్ చట్టం 1956 సెక్షన్ 9(2) ని పరిశీలించి.. ఆ చట్ట ప్రకారం.. దత్తత కోసం బిడ్డ తండ్రి అనుమతి తప్పనిసరి అని చెబుతూ.. ఆమె కేసు న్యాయం జరుగుతుందని.. కానీ ఆమె మాజీ భర్త వాదన విన్న తరువాతే నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు అన్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు జ్యోతి సింగ్ మాజీ భర్తకు కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో ఉంది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×