ప్రముఖ దర్శకులు పునీత్ కృష్ణ అండ్ అమిత్ రాజ్ గుప్త డైరెక్షన్లో రూపొందిన కొత్త వెబ్ సిరీస్ ‘త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్’. అయితే ఈ టైటిల్ వినగానే చాలామంది ఇదేదో ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అందరికీ అర్థమైపోతుంది. ఇది మొత్తం మసాలా సీన్లతో అసభ్యకర పదజాలంతో రూపొందింది అని. ఈ సిరీస్‌ను చూడాలనుకునే వారు ఫ్యామిలీ ఆడియన్స్‌తో మాత్రం చూడకూడదు. ఎందుకంటే ఇందులో అన్ని బోల్డ్ సీన్లు, భూతులు అత్యధికంగా ఉంటాయి. మానవ్ కౌల్, తిలోత్తమ సోమే లాంటి యాక్టర్స్ నటించారు.
కథ:
త్రిభువన్ మిశ్రా (మానవ్ కౌల్) సీఏ టాపర్. కానీ చాలీ చాలని శాలరీకి చిన్న జాబ్ చేస్తూ తన ఫ్యామిలీని నెట్టుకొస్తూ ఉంటాడు. అయితే ఎవరి లైఫ్‌లో అయినా సమస్యలు, ఇబ్బందులు అప్పుడప్పుడూ వస్తుంటాయి. కానీ మిశ్రా లైఫ్‌లో మాత్రం అన్ని సమస్యలు ఒకేసారి వస్తాయి. దీంతో అతడికి చాలా అమౌంట్ అవసరం అవుతుంది. ఇక అతడు చేసేదేమి లేక ‘మేల్ సెక్స్ వర్కర్’గా చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తున్న సమయంలోనే అతడు ఊహించని విధంగా డబ్బులు వస్తాయి. ఇక అంతా సాఫీగా సాగుతుంది అని అనుకున్నప్పుడు మళ్లీ ఒక ఇన్సిడెంట్ మిశ్రా లైఫ్‌ను మార్చేస్తుంది. అయితే మిశ్రా మేల్ సెక్స్ వర్కర్‌గా మారడానికి గల స్విచ్వేషన్స్ ఏంటి.. మళ్లీ తన లైఫ్‌లో వచ్చిన సమస్యలేంటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవలసిందే.
Also Read: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 12 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడదగ్గవి ఏవంటే..?
విశ్లేషణ:
ముందుగా ఈ సిరీస్‌ను చూడాలనిపించేలా ట్రైలర్ కట్ చేశారు. ఇందులో అడల్ట్ డోస్ ఎక్కువగానే ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక అనుకున్నట్లుగానే సిరీస్‌లో మసాలా గట్టిగా దట్టించారు. అయితే స్టార్టింగ్ రెండు ఎపిసోడ్లు స్లో నెరేషన్‌తో వెళ్తాయి. ఇందులో మిశ్రాకి సమస్యలు వచ్చేలా క్రియేట్ చేసిన సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి సస్పెన్స్‌గా కూడా అనిపిస్తాయి. ఇక మూడో ఎపిసోడ్ నుంచి మిశ్రా మేల్ సెక్స్ వర్కర్‌గా స్టార్ట్ చేసిన నుంచి కొంచెం స్పీడ్ అందుకుంటుంది.
మూడో ఎపిసోడ్ నుంచి అడల్డ్ డోసెజ్ ఎక్కువ పెంచారు. అయితే బోల్డ్ సన్నివేశాలు గట్టిగా దట్టించినప్పటికీ తరువాత ఏం జరుగుతుంది అనే క్యూరియోసిటీ ఉంటుంది. ఇక ఆరో ఎపిసోడ్ వరకు ఎంగేజింగానే వెళ్తుంది. కానీ ఆ తర్వాత ఎపిసోడ్స్ ఎట్నుంచి ఎటు వెళ్తాయో అర్థం కానీ పరిస్థితి ఉంటుంది. ఇందులో మిశ్రా స్టోరీతో పాటు రాజ్యభాయ్, బిందు స్టోరీ, శోభా పాఠక్ స్టోరీ అంతగా ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో తర్వాత ఎపిసోడ్లు కాస్త బోరింగ్ అనిపిస్తాయి. కాగా ఈ సిరీస్‌కి ముఖ్యమైన మైనస్ పాయింట్ రన్ టైం అనే చెప్పాలి.
ఎందుకంటే ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నిమిషాల నుంచి గంట పాటు ఉంటుంది. అలా మొత్తం 9 ఎపిసోడ్లతో వచ్చింది. దీనిని కట్ చేసి కేవలం 6 ఎపిసోడ్లుగా చిత్రీకరించాల్సి ఉన్నా.. దాన్ని 9 ఎపిసోడ్ల వరకు తీయడంతో బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ మేల్ సెక్స్ వర్కర్ ప్రెస్పెక్టివ్, ఉమెన్ సెక్సువల్ ప్రెజర్ యాస్పెక్టివ్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు.
ఎవరెలా చేశారు:
Also Read: రైటర్‌గా మారిన నాని.. ‘హిట్ 3’లో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో..!
ఈ సిరీస్‌లో త్రిభువన్ మిశ్రా పాత్రలో నటించిన మానవ్ కౌల్ తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అలాగే అతడి భార్య పాత్రలో నటించిన నైనా శరీన్ కూడా బాగా మెప్పించింది. ఇక ఇందులో నటించిన తిలోత్తమ శోమ అద్భుతమైన యాక్టింగ్‌తో దుమ్ము దులిపేసింది. యాక్టింగ్‌లో ఆమె దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే స్వేత బసు ప్రసాద్ కూడా పర్వాలేదనిపించుకుంది. మిగతా యాక్టర్స్ కూడా పర్వాలేదనిపించారు. ఇక టెక్నికల్‌గా కూడా ఈ సిరీస్ చాలా మంచి అనుభూతిని అందిస్తుంది. రామ్ సంపత్ బ్యాక్‌గ్రౌండ్ కూడా వావ్ అనిపిస్తుంది. అయితే ఈ సిరీస్ మధ్య మధ్య రైటింగ్ కాస్త వీక్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే ఆరో ఎపిసోడ్ వరకు చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత లెంగ్తీ సీన్స్, ఓవర్ స్రెచ్డ్ డ్రామాతో ఎంగేజ్ చేయలేకపోయారు. ఫైనల్‌గా ఈ సిరీస్ కాస్త లెంగ్తీగా ఉన్నప్పటికీ మసాలా సీన్లతో ఉండటంతో ఒక్కసారి చూడొచ్చు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.