EPAPER

Prisoners fighting at Tihar jail: తీహార్‌ జైలులో ఖైదీల ఫైటింగ్, అసలేం జరుగుతోంది?

Prisoners fighting at Tihar jail: తీహార్‌ జైలులో ఖైదీల ఫైటింగ్, అసలేం జరుగుతోంది?

Prisoners fighting at Tihar jail: ఢిల్లీలోని తీహార్ జైలులో ఖైదీల మధ్య ఫైటింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయపడిన ఖైదీలకు ట్రీట్‌మెంట్ చేయించారు అధికారులు. ఈ వ్యవహారంపై జైలు అధికారులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.


శుక్రవారం ఢిల్లీలోని తీహార్‌లోని ఖైదీలు కొట్టుకున్నారు. తొమ్మిదో నెంబర్ సెల్‌లో హత్యకేసు నిందితులు ఉన్నారు. వారిపై కొందరు ఖైదీలు పదునైన కత్తితో దాడి చేశారు. ఈ ఘటన ఫోన్ రూమ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తులను ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తలించారు. ట్రీట్‌మెంట్ అనంతరం వారిని తీహార్ జైలుకి తరలించారు.

గాయపడిన ఖైదీ వాంగ్మూలం మేరకు హరినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతీకారం తీర్చు కోవడానికే ఈ ఘర్షణ జరిగిందన్నది పోలీసు అధికారులు చెబుతున్నారు. జైలులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు, దాడి చేసిన దుండగులను గుర్తించే పనిలోపడ్డారు.


ALSO READ: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం

తీహార్ జైలులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకుముందు ఆ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. చాలాసార్లు ఖైదీల మధ్య ఆధిపత్యం కోసం దాడులు చేసుకున్నారు. అంతకు ముందు అంటే ఏప్రిల్‌లో తీహార్ జైలులో ఇలాంటి ఘటన జరిగింది. మూడో నెంబర్ సెల్‌లో రెండు వర్గాల ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పుడు నలుగురు ఖైదీలు గాయపడిన విషయం తెల్సిందే.

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×