EPAPER

CM Revanth Reddy: గొర్రెల స్కీమ్‌లో రూ.700 కోట్ల అవినీతి.. విచారణకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గొర్రెల స్కీమ్‌లో రూ.700 కోట్ల అవినీతి.. విచారణకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పథకంలో రూ.700కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గొర్రెల స్కీమ్, బతుకమ్మ చీరల పంపిణీ, కేసీఆర్ కిట్లు ఇలా బీఆర్ఎస్ వేల కోట్లు అవినీతి చేసిందన్నారు. వీటిపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ తీరు వల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు రాలేదని విమర్శించారు.


అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రస్తావన తీసుకొచ్చారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌కు ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు. 2009లో కరీంనగర్ ప్రజలు ఓడగొడతారని భయపడి పాలమూరుకు కేసీఆర్ వలసొస్తే..వలసలు వెళ్లే పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారన్నారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను భుజాల మీద మోసి పార్లమెంట్‌కు పంపించారన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంగా ఉన్న కేసీఆర్.. పాలమూరుకు ఏం చేయలేదని ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లా, కొడంగల్ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వకూడదని బీఆర్ఎస్ కుట్రలు చేసిందన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదన్నారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదన్నారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములను అమ్ముకున్నారన్నారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను సైతం రూ.7కోట్లకు అమ్మారన్నారు.


తెలంగాణలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలోనూ అవినీతి జరిగిందన్నారు. బతుకమ్మ చీరలు అని తెలంగాణ మహిళలను నమ్మించి సూరత్ నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేసి ఇక్కడి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుండు సున్నా ఇచ్చినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.

Also Read: బడ్జెట్‌లో విపక్షాలకు అన్యాయం..అందుకే నీతి అయోగ్‌ను బహిష్కరించాం: మంత్రి పొన్నం

సభను తప్పుదోవ పట్టించినప్పుడు సరిదిద్ధాల్సిన బాధ్యత నాపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామని, కానీ పూర్తిగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. 2017లో ఆనాటి సీఎం మీటర్లు బిగిస్తామని మోదీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమన్నారు. అబద్ధాలు రికార్డులో ఉంటే కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు నిజమనుకునే ప్రమాదం ఉందన్నారు.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×