EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకున్న పనులు నెరవేరకపోవచ్చు. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వినాయకుడిని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగుతాయి.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాంలు ఎదురైన అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకం చదవాలి.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులతో విహార యాత్రలు వెళ్తారు. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాల కోసం మరింత కష్టపడాలి. కీలక వ్యవహారాల్లో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మంచిది.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ధన లాభం ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాల కోసం బాగా కష్టపడాలి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత కోల్పోకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం క్షీణించవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

తుల:
తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం రెట్టింపు ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం. శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనులు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. అవవసర ఖర్చులు ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ఆర్థికపరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వదిలేయాలి. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఊహించని ఖర్చులు చుట్టుముడతాయి. శనిస్తోత్రం పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం పెరుగుతుంది. శ్రీ ఆంజనేయ దర్శనం శ్రేయస్కరం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో లాభాలు పొందుతారు. పొదుపు చేసే దిశగా ఆలోచన చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కొన్ని సంఘటనలు మనోధైర్యాన్ని పెంచుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

Related News

Navratri 2024: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది

Pitru Paksha 2024: పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వికులు సంతోషిస్తారు.

Trigrahi yog September 2024 Rashifal: ఒక్క వారంలో ఈ 6 రాశుల జీవితాలు మారబోతున్నాయి..

Auspicious Dream: కలలో ఈ పువ్వు కనపిస్తే ధనవంతులు అవవుతారట.. మీకు కనిపించిందా మరి

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం

Sun Transit 2024: సూర్యుని సంచారంతో ఈ నెలలో ఏ రాశి వారికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసా ?

Big Stories

×