EPAPER

Electric Heater: హీటర్‌తో వేడి చేసిన నీటిని స్నానం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..

Electric Heater: హీటర్‌తో వేడి చేసిన నీటిని స్నానం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..

Electric Heater: వర్షాకాలం వచ్చింది అంటే ఇంట్లోను, బయట ఎక్కడ ఉన్నా చల్లగా ఉంటుంది. వాతావరణం అంతా తేమతో నిండిపోయి ఉంటుంది. ఈ తరుణంలో చల్లటి వాతావరణంలో ఉండడం వల్ల కొంత మంది జ్వరం వంటి వాటికి కూడా గురవుతుంటారు. ముఖ్యంగా ఉదయం పూట చల్లటి నీటితో స్నానం చేయడానికి అయితే భయపడుతుంటారు. ఈ తరుణంలో వేడి నీటితో స్నానం చేసి చకచకా ఉద్యోగాలు, చదువులు అంటూ పరుగులు తీస్తుంటారు. అయితే ఇలా వేడి నీటితో స్నానం చేయడానికి కొంత మంది గీజర్, మరికొంత మంది గ్యాస్ స్టవ్, ఇక కట్టెల పొయ్యి లేదా వాటర్ హీటర్ వంటివి ఉపయోగిస్తుంటాయి.


అయితే వీటిలో ఏది ఉపయోగించినా కూడా అంత ప్రమాదం ఉండదు కానీ వాటర్ హీటర్ తో వేడి చేసిన నీటిని స్నానం చేయడం వల్ల సమస్యలే ఉంటాయట. తక్కువ ధరలో వచ్చిందని, కరెంటు కూడా తక్కువగా ఖర్చు అవుతుందని ఆలోచించి ఉపయోగిస్తుంటారు. కానీ ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయట. అయితే అవేంటో తెలుసుకుందాం.

హీటర్ తో నీటిని వేడి చేసి స్నానం చేస్తే సమస్యలే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు త్వరగా వేడెక్కెతుందని దీనితో వేడి చేసిన నీటిని స్నానం చేస్తే శరీరం అనారోగ్యం పాలవుతుందని అంటున్నారు. దీని వల్ల దురద, పొక్కులు, వంటి చర్మ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హీటర్లను ఉపయోగించే క్రమంలో గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి చాలా హానికరమైన వాయువులు రిలీజ్ అయి వికారం, శ్వాస కోశ సమస్యలు, తలనొప్పి వంటి వాటికి గురిచేస్తుందట.


ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా ఎదుర్కునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల హీటర్లను వాడకపోవడమే మంచిది అని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఆర్థిక పరిస్థితుల కారణంగా వాడాల్సి వస్తే కాస్త ఖరీదైనది అని ఆలోచించకుండా మంచి క్వాలిటీ ఉన్న హీటర్ కొనుగోలు చేసి వాడాలని సూచిస్తున్నారు.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×