EPAPER

Polio In Gaza: గాజాకు పోలియో ముప్పు.. వెల్లడించిన డబ్ల్యుహెచ్‌‌వో

Polio In Gaza: గాజాకు పోలియో ముప్పు.. వెల్లడించిన డబ్ల్యుహెచ్‌‌వో

Polio In Gaza: ఇజ్రాయిల్ యుద్ధంతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అక్కడ ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గాజా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని మురుగునీటి నమూనాల్లో పోలియో కారక అవశేషాలను గుర్తించారు. దీంతో వ్యాధి నిరోధక చర్యలకు ఉపక్రమించిన డబ్ల్యూహెచ్‌వో అక్కడి చిన్నారులకు 10 లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధం అయింది.


ఇప్పటి వరకు అక్కడ పోలియో కేసు నమోదు కాలేదు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంది. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా గడిచిన తొమ్మిది నెలలుగా వ్యాక్సిన్ పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయని.. దీంతో ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాధి ముప్పు అధికంగా ఉందన్నారు.  రెండేళ్లలోపు శిశువులకు ఇది మరింత ప్రమాదకరంగా మారిందని తెలిపారు.

పోలియో మైలిటిస్ వైరస్ కారణంగా సంభవించే ఈ వ్యాధి .. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చేపిస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడంతో కేసుల సంఖ్య 99 శాతం తగ్గిపోయింది.కానీ ఇటీవల గాజాలో నెలకొన్న పరిస్థితులతో అక్కడి చిన్నారులకు పోలియో ముప్పుతో పాటు హెపటైటిస్ ఏ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.


గాజాలోని పాలస్తీనియన్లకు వ్యాక్సిన్‌లను అందజేయడానికి వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 3 లక్షల వ్యాక్సిన్లు అందజేసినట్లు తెలిపింది. పోలియో వ్యాధి సోకిన వ్యక్తి యొక్క విసర్జనల ద్వారా ఇది సులభంగా వ్యాపిస్తుంది. అంతే కాకుండా దగ్గినప్పుడు లేదా తుమ్మినపుడు, తుంపర్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది పక్షవాతం మరియు తీవ్రమైన సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుంది. గాజా యుద్ధానికి ముందు ఆక్రమిత ప్రాంతాల్లో ఇమ్యునైజేషన్ అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. 20023 నాటికి పోలియో వ్యాక్సిన్ కవరేజీ 99% గా ఉందని వెల్లడించింది. అయితే తాజా లెక్కల ప్రకారం గతేడాదికి ఇది 89 శాతానికి తగ్గింది.

Also Read:‘ఆ సామాజిక వర్గంపై దాడులు ఆపండి’.. పాకిస్తాన్ కు ఐరాస మానవ హక్కుల సంఘం హెచ్చరిక

గాజా యొక్క హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఆరోగ్య విపత్తు గురించి హెచ్చరించింది. పోలియో విస్తరించేందుకు ముఖ్యంగా గుడారాలు జనావాస ప్రాంతాల మధ్య ప్రవహించే మురుగునీరు ముఖ్య కారణమని వెల్లడించింది. ఈ ముప్పు నుంచి బయట పడేందుకు తక్షణమే కాల్పుల విరమణ చేయాలని తెలిపింది.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×