EPAPER

Paris Olympics 2024: తొలిసారి నదిలో ఒలింపిక్ ప్రారంభోత్సవం

Paris Olympics 2024: తొలిసారి నదిలో ఒలింపిక్ ప్రారంభోత్సవం

Paris prepares for Olympics opening ceremony spectacle along River Seine: 129 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలో తొలిసారి ప్రారంభోత్సవ వేడుకలు పారిస్ లోని సెయిన్ నదిలో జరగనున్నాయి. 33వ ఒలింపిక్ వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. నేటి రాత్రి 7.30కి విశ్వ క్రీడల సంబరాలు ప్రారంభం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఇవి మనకు కనిపిస్తాయి. ఇకపోతే స్పోర్ట్స్ 18, జియో టీవీ సినిమా నుంచి ఒలింపిక్ వేడుకలు ప్రసారం కానున్నాయి.


ఇన్నేళ్ల ఒలింపిక్ చరిత్రలో వేడుకలన్నీ కూడా స్టేడియం లోపల నిర్వహించేవారు. కానీ ఇప్పుడు సరికొత్తగా ప్రారంభోత్సవ వేడుకలు స్టేడియం బయట జరగనున్నాయి. 10, 500 మంది అథ్లెట్లు ఆరు కిలోమీటర్ల వరకు బోట్లపై పరేడ్ చేయనున్నారు.  దాదాపు 2 గంటలు ఈ వేడుక జరగనుంది. ఈ బోట్లలో కెమెరాలు అమర్చారు. వీటి ద్వారా తమ దేశపు ఆటగాళ్లను చూసే అవకాశం ఉంటుంది. పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 నినాదం ఏమిటంటే ‘గేమ్స్ వైడ్ ఓపెన్ ’ గా పేర్కొన్నారు.

పారిస్ ఒలింపిక్స్ నదిలోనే కాదు.. వీధుల్లో కూడా ఒలింపియన్ పరేడ్ జరగనుంది. అంటే నది ఒడ్డుకు వెళ్లేముందు వీధుల ద్వారా క్రీడాకారులు సంతోష సంబరాలతో సాగిపోతారు. ఈ మధ్యలో సాంస్క్రతిక కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఆకాశమే హద్దుగా డిజిటల్ గ్రాఫిక్స్ సందడి చేయనున్నాయి.  ఈ వేడుకలను చూసేందుకు దాదాపు 3 లక్షల మంది రానున్నట్టు సమాచారం.


Also Read: ఒలింపిక్స్ లో భారత్ ప్రతికూలతలు ఇవే..

పరేడ్ లో మొదట గ్రీస్ దేశాన్ని ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఎందుకంటే మొట్టమొదట 1896లో ఒలింపిక్స్ గ్రీస్ లోనే ప్రారంభమయ్యాయి. అందుకే ప్రతీ ఒలింపిక్ లో ఆ దేశానికే అగ్రతాంబూలం దక్కుతోంది. ఇకపోతే సెయిల్ నదిలో ఈ ప్రారంభోత్సవ వేడుకల కోసం రంగురంగులతో అలంకరించిన 94 బోట్లను సిద్ధం చేశారు. వీటికి రక్షణగా పెద్ద పెద్ద బోట్లను నడిపిస్తున్నారు. ఎటువంటి ఉపద్రవాలు జరగకుండా గజఈతగాళ్లను సిద్ధం చేశారు. అంతేకాదు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే వినూత్నంగా ఒలింపిక్ ప్రారంభోత్సవాలు జరగాలని చేసే ప్రయత్నం విజయవంతం కావాలని మనం కూడా కోరుకుందాం.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×