EPAPER

YS Jagan Petition : జగన్ పిటిషన్ పై విచారణ.. మంగళవారానికి వాయిదా

YS Jagan Petition : జగన్ పిటిషన్ పై విచారణ.. మంగళవారానికి వాయిదా

YS Jagan Petition in AP High Court : ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 11 స్థానాల్లోనే గెలిచిన వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా దూరమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే.. 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. కనీసం 10 శాతం సభ్యులుండాలి. అంటే ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు సాధించిన పార్టీకే ఆ హోదా ఉంటుంది. వైసీపీకి ఉన్నది 11 ఎమ్మెల్యేలే కావడంతో.. అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.

దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తమ ఆ హోదాను ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ.. హై కోర్టును ఆశ్రయించారు. జగన్ వేసిన పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జగన్ పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందో తెలియాలంటే మంగళవారం వరకూ వేచి చూడాల్సిందే.


Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×