EPAPER

B.Tech seats in Telangana: ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బీటెక్‌లో మరో 9వేల సీట్లు

B.Tech seats in Telangana: ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బీటెక్‌లో మరో 9వేల సీట్లు

Nine Thousand B.Tech seats in Telangana: ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. నేటి నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా, 27, 28 తేదీలలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో పెంచనున్న సీట్లు నేడు లేదా రేపు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు రోజుల్లోనే కొత్త సీట్లకు విద్యాశాఖ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.


రాష్ట్రంలో డిమాండ్ లేని బ్రాంచీల స్థానలంలో సీఎస్ఈ, ఇతర బ్రాంచీల ద్వారా సుమారు 7వేల సీట్లతో అదనంగా 20వేల 500 కొత్త సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొత్త సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందకు ఏఐసీటీఈ సైతం ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత కౌన్సెలింగ్ లో సుమారు 2,600 సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే రెండో విడత కౌన్సెలింగ్ కు సుమారు 9వేల వరకు మంజూరు చేసేందుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తి చేశారు. దాదాపు సగం సీట్లకు కోత విధించిందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి.


తొలి విడత కౌన్సెలింగ్ లో 75,200 మందికి ఇంజినీరింగ్ సీట్లు లభించాయి. వీరంతా ఇప్పటికే ట్యూషన్ ఫీజు చెల్లంచడంతోపాటు ఆన్ లైన్ లో సెల్ప్ రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే గడువు ముగిసింది. అయితే కేవలం 55వేల మంది విద్యార్థులు మాత్రమే రిపోర్టు చేయగా.. మిగతా 20వేల మంది విద్యార్థులు రిపోర్టు చేయలేదు. ఇందులో చాలామంది మేనేజ్ మెంట్ కోటాలో చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: కేసీఆర్ బీజేపీకి ..జగన్ కాంగ్రెస్ కి జై కొడతారా?

అయితే విద్యాశాఖ 90శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలకే కొత్తగా 120 సీట్లు ఇస్తామని చెప్పి 2600 సీట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా, కాలేజీ యాజమాన్యాల నుంచి ఒత్తిడి రావడంతో 80, 70, 50 శాతం సీట్లను భర్తీ చేసిన కళాశాలలకు కూడా అదనగంగా 120 సీట్లు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు పట్టణ, గ్రామీణ, ఓఆర్ఆర్ లోపల, బయట, మైనార్టీ, నాన్ మైనార్టీ వారీగా కలరత్తు చేసింది. కానీ చివరికీ ప్రతి కళాశాలకు 120 సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై నేడు లేదా రేపు క్లారిటీ రానుంది.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×