EPAPER

Paris Olympics 2024: విశ్వక్రీడల్లో.. పతకాలు తేగలిగే వీరులు?

Paris Olympics 2024: విశ్వక్రీడల్లో.. పతకాలు తేగలిగే వీరులు?

Medals for India at Olympic Games(Sports news in telugu): విశ్వక్రీడలు ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే ఇంతవరకు మన భారత క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధించారు? ప్రస్తుతం ఎన్ని పతకాలు సాధించగలరనే నమ్మకం ఉన్నవాళ్లు ఉన్నారు? ఈ వివరాలు ఒకసారి చూద్దామా..


ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలింపిక్స్‌లో భారతదేశం మొత్తమ్మీద 35 పతకాలు సాధించింది. వీరిలో ఇద్దరు మాత్రమే స్వర్ణపతకాలు సాధించారు. అభినవ్ బింద్రా (2008), నీరజ్ చోప్రా (2021) మాత్రమే వ్యక్తిగత స్వర్ణ పతక విజేతలుగా ఉన్నారు.

2020లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో మనవాళ్లు 18 అంశాల్లో 124 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వీరందరూ కలిసి 7 పతకాలు తెచ్చారు. ఇప్పుడు 16 క్రీడాంశాల్లో 117మంది పాల్గొంటున్నారు. అయితే కనీసం రెండంకెలు దాటించాలని భావిస్తున్నారు.


జావెలిన్ త్రోలో ప్రస్తుత చాంపియన్ నీరజ్ చోప్రా మినహా మిగిలిన అథ్లెట్లు వారివారి ఈవెంట్లలో ఎంతవరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, రెజ్లర్ సుశీర్ కుమార్ మాత్రమే గత రెండు ఒలింపిక్స్ నుంచి వరుసగా పతకాలు అందిస్తున్నారు. సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించారు.

Also Read: సూర్యకుమార్.. కోచ్‌తో రిలేషన్ స్పెషల్, నాకు సంతృప్తి లేదంటూ

షూటింగులో సిఫత్ కౌర్, సందీప్ సింగ్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ మూడు విభాగాల్లో పాల్గొంటున్నారు. వీరందరికీ జాతీయ క్రీడల్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇకపోతే 2012 లండన్ ఒలింపిక్ గేమ్స్ లో గగన్ నారంగ్ కాంస్య పతకం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ రాలేదు. ప్రస్తుతం గగన్ నారంగ్ ప్లేయర్ల కోసం చెఫ్ డి మిషన్ ఆఫ్ ఇండియాగా సేవలు అందిస్తున్నారు.

భారతదేశంలో రెజ్లింగ్ ఫౌండేషన్ మధ్య వివాదాల్లో చాలామంది రెజ్లర్లు నేషనల్ క్యాంపులో పాల్గొనలేదు. మరి అది ఏమైనా ఒలింపిక్స్ లో ప్రభావం చూపిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అన్షుమాలిక్, అమన్ సెహ్రావత్, యాంటీమ్ పై ఆశలున్నాయి. ఇకపోతే టోక్యో గేమ్స్ రజత పతక విజేత గాయంతో బాధపడుతోంది. అందుకని ఈసారి పతకం అనుమానంగానే ఉంది. పతకాలు తేగలిగే సత్తా ఉన్నవారి వివరాలని సీనియర్లు చెబుతున్నారు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×