EPAPER

Kargil Vijay Diwas 2024: కార్గిల్ విజయ్ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. లదాఖ్‌లో షింకున్ లా ప్రాజెక్టు పనులు ప్రారంభం

Kargil Vijay Diwas 2024: కార్గిల్ విజయ్ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. లదాఖ్‌లో షింకున్ లా ప్రాజెక్టు పనులు ప్రారంభం

Kargil Vijay Diwas 2024: లదాఖ్ లో శుక్రవారం జరుగనున్న కార్గిల్ విజయ్ దివస్‌ 25వ వార్షిక వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. 1999 పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత దేశం విజయం సాధించిన సందర్భగా ఈ వేడుకలు జరుపుకుంటారు. వేడుకల్లో భాగంగా యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైకికులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం తరువాత ప్రధాని మోదీ.. లదాఖ్ లోని లేహ్ ప్రాంతంలో షింకున్ లా ట్విన్ టన్నెల్ పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.


4.1 కిలోమీటర్ల పొడవున్న ఉన్న ఈ టన్నెల్ ట్విన్ ట్యూబ్ ఆకారంలో ఉంటుంది. 15,800 అడుగుల ఎత్తులో నిము-పడుమ్-దర్చా రోడ్డుపై నిర్మిస్తున్నారు. చలికాలంలో మంచు తీవ్రంగా కురవడంతో నాలుగు నెలలపాటు లేహ్ నగరానికి వెళ్లేందుకు దారి మూసుకుపోతుంది. ఆ సమయంలో అంతా కొండప్రాంతం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఆ దారితలో కొండచరియులు, భారీ మంచు శకలాలు విరిగి పడుతుంటాయి.. ఈ ఘటనల్లో ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఇప్పుడు ఈ టన్నెల్ నిర్మాణంతో ఆ సమస్య తీరిపోతుందని.. లేహ్ నగరానికి సంవత్సరమంతా దారి తెరిచే విధంగా టన్నెల్ నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు.


జూలై 26న ప్రతి భారత పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు అని ప్రధాని మోదీ ట్విట్టర్ ఎక్స్ లో తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. ”25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా.. దేశ భద్రత కోసం పనిచేసే వారికి ఈ రోజు అంకితం. నేను కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించేందుకు కార్గిల్ విచ్చేస్తాను. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమవుతాయి. లేహ్ నగరానికి మంచు వాతావరణంలో కూడా రోడ్డు మార్గం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు చాలా అవసరం.” అని ట్వీట్ చేశారు.

కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించిన ప్రజలు
లదాఖ్ లోని ద్రాస్ ప్రాంతంలో ఉన్న కార్గిల్ యుద్ద వీరుల స్తూపం వద్ద శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ స్తూపం యుద్ధ వీరుల ధైర్య, సాహసాలకు ప్రతీకం. కార్గిల్ యుద్ధం 25వ వార్షికత్సవం సందర్భంగా యుద్ధంలో దేశ సరిహద్దులు కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు దేశ పౌరులంతా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

 

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×