EPAPER

Rahul Dravid’s son Samit signed: ఐపీఎల్‌పై ద్రావిడ్ కొడుకు ఫోకస్, టీ20 వేలంలో…

Rahul Dravid’s son Samit signed: ఐపీఎల్‌పై ద్రావిడ్ కొడుకు ఫోకస్, టీ20 వేలంలో…

Rahul Dravid’s son Samit signed: టీమిండియా మాజీ కోచ్ రాహుల్‌ద్రావిడ్ కొడుకు సమిత్ ఐపీఎల్‌పై ఫోకస్ చేశాడా? కర్ణాటకలో లీగ్‌లో యువ ఆటగాడు సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అది సక్సెస్ అయినా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.


క్రికెట్‌లో మాజీ దిగ్గజాల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోలే పోతున్నారు. వారిలో సునీల్ గవాస్కర్ వారసత్వాన్ని అందుకున్నాడు రోషన్. కానీ మైదానంలో మాత్రం నిరూపించుకోలేపోయాడు. ఇక సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ గురించి చెప్పనక్లేదు. బ్యాట్స్‌మన్ కమ్ బౌలర్. కాకపోతే మొన్నటి ఐపీఎల్‌లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. రేపటి రోజైనా రాణిస్తాడేమో చూడాలి.

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడు సమిత్ ఐపీఎల్‌లో ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. సమిత్ ద్రావిడ్ బౌలర్ కమ్ బ్యాట్స్‌మన్. ఎక్కువగా తండ్రి మాదిరిగానే మిడిలార్డర్‌లో ఆడేందుకు ఇక్కువగా ఇష్టపడతాడు. ఇప్పటికే వివిధ ఏజ్ గ్రూపుల టోర్నీల్లో సత్తా చాటాడు. ప్రస్తుతం కర్ణాటకలోని టీ20 టోర్నీమెంట్ జరుగుతోంది. అందులో మైసూర్ వారియర్స్ టీమ్ సమిత్ ను 50 వేలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో కూచ్ బేహార్ ట్రోఫీ గెలిచిన అండర్-19 జట్టులో సమిత్ ఉన్నాడు. కేఎస్సీఏ-11 తరపున ఆడుతున్నాడు.


ALSO READ: పారిస్ ఒలింపిక్స్ లో.. రెండో రోజు ఇదీ మన షెడ్యూల్

గత సీజన్‌లో విన్నర్‌గా నిలిచింది మైసూర్ వారియర్స్ టీమ్. ఈసారీ కరుణ్‌నాయర్ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల వేలంలో మైసూర్ వారియర్స్ సుమిత్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో సత్తా చాటితే, డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ వేలంలో సమిత్ పేరు రావచ్చని అంటున్నారు. ఒకవేళ సమిత్ ఎంట్రీ ఇస్తే.. ద్రావిడ్‌ను మరపిస్తాడేమో చూడాలి.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×