EPAPER

Russia’s most beautiful biker dies: టర్కీలో ప్రమాదం, రష్యా అందగత్తె బైకర్ టాట్యానా మృతి

Russia’s most beautiful biker dies: టర్కీలో ప్రమాదం, రష్యా అందగత్తె బైకర్ టాట్యానా మృతి

Russia’s most beautiful biker dies: రష్యా మోస్ బ్యూటీఫుల్ బైకర్ టాట్యానా ఓజోలినా మృతి చెందింది. టర్కీలో జరిగిన మోటార్ బైక్ యాక్సిడెంట్‌లో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. 38 ఏళ్ల ఓజోలినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు నిరాశ మిగిల్చింది.


టాట్యానా ఓజోలినా పేరు చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆమె సొంతం. అత్యంత అందగత్తె మాత్రమే కాదు.. బైకర్ కూడా. బైక్ రైడ్ చేయడమంటే మహా ఇష్టం. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంది. సోషల్‌మీడియాలో మోటా టాన్యాగా పేరుగాంచింది. టాట్యానాకు ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది, టిక్ టాక్‌లో 50లక్షల మంది, యూట్యూబ్‌లో 20 లక్షల మంది ఫాలోవర్స్ ఆమె సొంతం.

టాట్యానా తాను చేసే ప్రతీ పని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. దీనికితోడు బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన బైక్ రైడింగ్‌లు చేస్తోంది. టాట్యానా అందానికి చాలామంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా మోటార్ బైక్‌లపై ఉన్న అభిరుని కారణంగా నిరంతరం వార్తల్లో నిలిచేదామె. రష్యా సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ కూడా.


రష్యా నుంచి బైక్ రైడ్‌ చేస్తూ టర్కీకి వెళ్తోంది టాట్యానా. అతివేగంగా వెళ్తున్న సమయంలో తోటి రైడర్లు అడ్డురావడంతో సడన్‌గా బ్రేక్ వేసింది. దీంతో వాహనంపై కంట్రోల్ కోల్పోయింది. ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లో మృతి చెందింది. మరో టర్కీ బైక్ రైడర్‌కు తీవ్రగాయాల య్యాయి. వెంటనే ఆయన్ని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

ALSO READ: ఆందోళనకరంగా జపాన్ జనాభా తగ్గుదల.. వరుసగా 15వ ఏడాది తగ్గిన జననాల సంఖ్య!

టాట్యానాకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. టాట్యానా మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. డెడ్ బాడీ అక్కడి నుంచి ఆమె సొంతూరుకు తరలించారు. ఆమె మరణవార్త విని లక్షలాది మంది అభిమానులు షాక్‌లో ఉన్నారు.

Tags

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×