EPAPER

Nothing Phone (2a) Plus: నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ వచ్చేస్తుంది.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే?

Nothing Phone (2a) Plus: నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ వచ్చేస్తుంది.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే?

Nothing Phone (2a) Plus Launching In July 31: ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్ తన లైనప్‌లో ఇప్పటికే చాలా మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2, నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో కంపెనీ ఇప్పుడు మరో మోడల్‌ను ఫోన్ ప్రియులకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ సారి తన లైనప్‌లో ఉన్న Nothing Phone (2a) Plusని లాంచ్ చేసేందుకు రెడీ అయింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఈ నెల అంటే జూలై 31న గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేయబోతుంది. ఇది MediaTek Dimensity 7350 Pro ప్రాసెసర్‌ని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. Nothing Phone (2a) Plus గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..


Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్ 3GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది 10 శాతం వేగంగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ Mali-G610 MC4 GPUని 1.3 GHz వరకు కలిగి ఉంది. ఇది 7200 ప్రోలోని GPU కంటే 30 శాతం వేగవంతమైనదని కంపెనీ తెలిపింది. ప్రాసెసర్ HDR ఫొటోలతో 4K వీడియో రికార్డింగ్, ముందు, వెనుక కెమెరాలలో HDR10+ ప్లేబ్యాక్‌కు మద్దతు ఇస్తుంది.

దీనికి డ్యూయల్ 5G, బ్లూటూత్ 5.3, Wi-Fi 6 సపోర్ట్ ఉందని కంపెనీ తెలిపింది. Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్‌లో 12GB RAM, 8GB వరకు వర్చువల్ RAM ఉంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది కాబట్టి దీనికి సంబంధించిన మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని none.tech ఆన్‌లైన్ ఈవెంట్‌లో ప్రసారం చేయనున్నారు. ఇక ఇప్పుడు దీని ముందు మోడల్ నథింగ్ ఫోన్ 2 ఏ విషయానికొస్తే..


Also Read: జియో సంచలనం.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చుక్కలే.. ధర మరీ ఇంత తక్కువా!

నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ 1,080×2,412 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే, 30Hz నుండి 120Hz వరకు అనుకూల రిఫ్రెష్ రేట్, 394ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ 2a ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 7200 Pro SoCని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5 పై రన్ అవుతుంది.

ఫోన్ 2a 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ 2a 12GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ 2a వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi 6 డైరెక్ట్, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×