EPAPER

Telangana:కేసీఆర్ బీజేపీకి ..జగన్ కాంగ్రెస్ కి జై కొడతారా?

Telangana:కేసీఆర్ బీజేపీకి ..జగన్ కాంగ్రెస్ కి జై కొడతారా?

Telugu States regional parties with National parties(Political news Telugu):

భారత రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ఉండటానికి అన్నీ జాతీయ పార్టీలే..అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలనుంచి జాతీయ పార్టీ ఉనికి కోసం పోరాడేవే తప్ప వాస్తవాికి బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే జాతీయ పార్టీల కింద చెలామణి అవుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు కూటములుగా వివిధ ప్రాంతీయ పార్టీలను చేర్చుకుని అమెరికా అధ్యక్ష తరహా ఎన్నికల తరహాలో ద్వంద్వ పార్టీ వ్యవస్థగా మారాయి. దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసుకునే పరిస్థితికి వచ్చాయి. ఏవో కొన్ని రాష్ట్రాలు తప్ప ఎక్కువ శాతం రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వం కోల్పోతున్నాయి. అవి ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేయబడ్డాయో..స్థానిక సమస్యల సాధన కోసం పోరాడాలని అనుకున్నాయో అవి నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. వాటిని ఏర్పాటు చేసిన నేతల స్వార్థ, సంకుచిత వైఖరితో స్థానిక ప్రజలు క్రమంగా మార్పు కోరుకుంటున్నారు. జాతీయ పార్టీలతోనే తమకు మనుగడ అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి కేవలం ప్రాంతీయ పార్టీ నేతల స్వయంకృత తప్పిదాలే అని చెప్పాలి.


ఆశయాలు నీరుగార్చిన కేసీఆర్

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను పరిశీలిస్తే..తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్..ఆ దిశగా పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేశారు. ఏ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీని స్థాపించారో అదే తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం సాధించిన నేతగా తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో కేసీఆర్ ను తెలంగాణ కు తొలి ముఖ్యమంత్రిని చేశారు. తెలంగాణ అభివృద్ధికి తాను పాటుపడతానని..నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో బలంగా ప్రజలలో సెంటిమెంట్ ముద్రను వేయగలిగారు. తొలి ఐదేళ్ల పాలనకు మెచ్చిన ప్రజలు మరో సారి అధికారాన్ని కట్టబెట్టారు. రెండో సారి సీఎం అయిన కేసీఆర్ మనసు జాతీయ రాజకీయాల దిశగా పయనించింది. టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చి మొత్తం ప్రాంతీయతకే ముప్పు తెచ్చారు. ఏ ఆశయాలతో పార్టీ ఏర్పాటు చేశారో ఆ ఆశయాలను నీరు గార్చారు.


బీజేపీలో చేరతారా?

నిధుల దుర్వినియోగం, నీళ్ల ప్రాజెక్టులన్నీ అవినీతి మయం, నియామకాలు లేకుండా చేయడం తో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడారు జనం. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లే ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ డేంజర్ జోన్ లో పడింది. మరో పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పార్టీ ప్రతిపక్ష హోదా సైతం కోల్పోతుంది. బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమే అని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితితో ప్రాంతీయ అస్తిత్వం కోల్పోయిన పార్టీకి ఏదైనా జాతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇటీవల బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ అండ తప్పనిసరి.

కక్ష రాజకీయాలు

ఏపీలో తండ్రి వారసత్వంతో అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్. కాంగ్రెస్ నుంచి విభేదించి సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టి రాజకీయాలలో అతి తక్కువ కాలంలోనే ఎదిగారు. ఏపీ సీఎంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. తొలి నాళ్లో బాగానే ఉన్నా క్రమంగా కక్ష పూరిత రాజకీయాలకు తెరలేపారు. అధికారంలో ఉన్న మంత్రులు కూడా నిరంతరం టీడీపీ నేతలను నోటి దురుసుతో మాట్లాడటం చూసి ప్రజలలో ఏహ్య భావం కలిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా హుందాగా ప్రవర్తించక ..ప్రజా సమస్యలు పక్కన పెట్టి స్వార్థ రాజకీయాలకు తెరతీశారు. ఏపీలో కీలక సమస్యలైన రాజధాని, పోలవరం వంటి వాటిపై పోరాడక కేవలం తమ ప్రధాన ప్రతిపక్షం పైనే పోరాటాలు చేశారు. వై నాట్ 175 నినాదం కాస్తా కేవలం 11 స్థానాలకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ కూడా సపోర్ట్ లేనిదే ముందుకు సాగలేమన్న విషయాన్ని గ్రహించింది. తెలుగు దేశాధినేత చంద్రబాబు సైతం బీజేపీ, జనసేనలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి విజయం సాధించారు. అందుకే జగన్ మైండ్ సెట్ కూడా క్రమంగా మారుతోంది. వచ్చే ఎన్నికలలో కూటమిని ఎదుర్కోవాలంటే తనకి కాంగ్రెస్ సపోర్ట్ కావాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న సమీకరణాలు

అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో చకచకా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అటు కేసీఆర్, ఇటు జగన్ తమ ప్రాంతీయ పార్టీలను వదిలి జాతీయ పార్టీల పొత్తు కోసం తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది.జాతీయ పార్టీల మద్దతు ఉంటేనే తాము ఏదైనా చెయ్యగలము..రాబోయే రోజుల్లో సీఎం కావాలన్నా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవాల్సిందే అని భావిస్తున్నారని రాజకీయ విమర్శకులు చెబుతున్న మాట.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×