EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!
Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం పొందుతారు. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. దత్తాత్రేయుడిని ఆరాధించాలి.
వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. తోటివారి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పర్వాలేదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది. సూర్య నమస్కారంతో మేలు జరుగుతుంది.
కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలకమైన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులు, మిత్రుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభాలు పొందుతారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సవాళ్లను ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంది. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు ఆశించిన లాభాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తోటివారి సహకారంతో విజయాలు పొందుతారు. శివారాధన శ్రేయస్కారం.
తుల:
తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. ప్రారంభించిన పనుల్లో ఎలాంటి ఆటం లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. పెద్దల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం కూడా ఉండవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్భనం మనోబలాన్ని పెంచుతుంది.
ధనుస్సు:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఎదురైనా విజయం వరిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
మకరం:
మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కుటుంబ కలహాలు వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సమస్యలను అధిగమించి విజయం సాధిస్తారు. శ్రతువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ప్రయాణాలు ఉంటాయి. అవసరానికి సహాయం పొందుతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు వరిస్తాయి. సంపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అభయ ఆంజనేయస్వామి ప్రార్థనలతో ఆపదలు తొలగిపోతాయి.


Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×