EPAPER

NEET UG: నీట్ ఫలితాలపై గందరగోళం.. విద్యా శాఖ స్పష్టత

NEET UG: నీట్ ఫలితాలపై గందరగోళం.. విద్యా శాఖ స్పష్టత

Revised Results: ఈ రోజు సాయంత్రం నీట్ యూజీ సవరించిన ఫలితాలు విడుదలైనట్టు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఎన్టీయే వెబ్ సైట్‌లో నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డు పేరిట ఓ లింక్ కూడా కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు నేపథ్యంలో సవరించిన ఫలితాలు విడుదలయ్యాయే అందరూ అనుకున్నారు. కానీ, తీరా ఆ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ కాకపోవడంతో గందరగోళం నెలకొంది. విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ గందరగోళం నేపథ్యంలోనే విద్యా శాఖ స్పష్టత ఇచ్చింది.


రివైజ్డ్ రిజల్ట్ ఇంకా రిలీజ్ చేయలేదని, ఎన్టీయే వెబ్ సైట్‌లో ఉన్నది పాత లింకు అని విద్యా శాఖ వివరణ ఇచ్చింది. ఆ లింక్ చూసి స్కోర్ కార్డులు ప్రకటించినట్టుగా భావించి ఉంటారని, కానీ, సవరించిన స్కోరు కార్డులు ఇంకా విడుదల చేయలేదని స్పష్టత ఇచ్చింది. త్వరలోనే ఫలితాలపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపింది.

Also Read: దారుణం.. బ్రతికుండగానే సజీవంగా పూడ్చిపెట్టిన వీడియో వైరల్


ఎన్టీయే యూజీ పరీక్షచుట్టు ఉన్న వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు తుది విచారణ చేపట్టింది. దీంతో ఎన్టీయే నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసిందని అనుకున్నారు. ఎన్టీయే వెబ్ సైట్‌లో కూడా అలా లింక్ కనిపించడంతో కన్ఫ్యూజ్ అయ్యారు. దీనికి తోడు వివాదాస్పద ఫిజిక్స్‌లో 19వ ప్రశ్నకు సమాధానంపై కూడా సుప్రీంకోర్టు ఈ రోజు క్లారిటీ ఇచ్చింది. ఆప్షన్ 4ను సరైన సమాధానంగా స్వీకరించాలని సూచించింది. దీంతో ఈ సమాధానంతో రివైజ్ చేసిన ఫలితాలను విడుదల చేసి ఉంటుందని భావించారు. సవరించిన ఫలితాలు విడుదలయ్యాక https://exams.nta.ac.in/ ఈ వెబ్ సైట్‌లో చూసుకోవచ్చు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×