EPAPER

Tanikella Bharani: తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం..

Tanikella Bharani: తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం..

Tanikella Bharani: రచయిత, నటుడు తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 800 సినిమాల పైచిలుకు చిత్రాల్లో నటించి మెప్పించిన తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం అందుకున్నారు. ఎస్ఆర్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది.


ఆగస్ట్ 3న వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో ఈ డాక్టరేట్ ను ఆయనకు అందివ్వనున్నారు. ఈ విషయం తెలియడంతో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనికెళ్ల భరణి హైదరాబాద్‌లోని రైల్వే కాలేజీలో ఓ నాటకం వేయాల్సివచ్చినపుడు అద్దె కొంప అనే నాటకం రాసి ప్రదర్శించగా ఆ నాటకానికి మొదటి బహుమతి వచ్చింది. అలా అయన రచయితగా మారారు. ఆ తరువాత ఎన్నో మంచి నాటకాలను రాసి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక తనికెళ్ళ భరణి వ్రాసిన చల్ చల్ గుర్రం నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు, రాళ్ళపల్లి ద్వారా వంశీకి పరిచయమై కంచు కవచం చిత్రానికి రచయితగా మారారు. ఇంక అదే చిత్రంలో ఒక చిన్న పాత్రలో కూడా నటించారు. ఆ తరువాత లేడీస్ టైలర్ సినిమాలో తనికెళ్ల భరణి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఒకపక్క రచయితగా.. ఇంకోపక్క నటుడిగా కొనసాగుతూ వస్తున్నారు.


ఇక ఆయనకు అవార్డులకు కొదువేం లేదు. సముద్రం సినిమాకు ఉత్తమ విలన్‌గా, నువ్వు నేను సినిమాలో ఉత్తమ క్యారెక్టర్‌ నటునిగా, గ్రహణంతో ఉత్తమ నటునిగా, మిథునం సినిమాకు గాను ఉత్తమ రచయిత.. ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×