EPAPER

HMD Crest Launched: హెచ్‌ఎమ్‌డీ నుంచి మొదటి ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే వదలరు!

HMD Crest Launched: హెచ్‌ఎమ్‌డీ నుంచి మొదటి ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే వదలరు!

HMD Crest Launched: HMD తన మొదటి ఫోన్‌ను ఈ రోజు భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ క్రెస్ట్ లైనప్‌లో కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో వనిల్లా క్రెస్ట్ మోడల్, క్రెస్ట్ మ్యాక్స్ వెర్షన్ ఉన్నాయి. ఈ ఫోన్లు భారతదేశంలో లాంచ్ చేయబడిన HMD బ్రాండ్ మొదటి ఫోన్లు. రెండు 4G ఫోన్‌లు Unisoc T760 SoC, 6.67-అంగుళాల FHD+ OLED ప్యానెల్, 50MP ఫ్రంట్ షూటర్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తాయి.


HMD క్రెస్ట్  6GB+128GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటంది. దీని ధర రూ.14,499. ఇది మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. పర్పుల్, రెడ్, బ్లూ. HMD క్రెస్ట్ మాక్స్ 8GB/256GB స్టోరేజ్ యూనిట్‌లో రూ. 16,499 నుండి ప్రారంభమవుతుంది. ఇది గ్రీన్, రెడ్,  పర్పుల్ కలర్స్‌లో వస్తుంది. లాంచ్ ఆఫర్ కింద, HMD క్రెస్ట్ రూ. 12,999. HMD క్రెస్ట్ మ్యాక్స్ రూ. 14,999కి అందుబాటులోకి వచ్చాయి.

HMD క్రెస్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. HMD క్రెస్ట్ 6.67 అంగుళాల ఫుల్ HD + OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది 6GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. Unisoc T760 SoC నుండి పవర్ పొందుతుంది. ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,00mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. HMD క్రెస్ట్ 50MP ప్రైమరీ కెమెరా, AI లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ఇది ముందు భాగంలో 50MP షూటర్‌ని కలిగి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14‌లో రన్ అవుతుంది.


Also Read: Xiaomi 14 Civi Limited Edition: షియోమీ నుంచి కొత్త ఫోన్.. 29 న లాంచ్.. లుక్ సూపర్!

HMD క్రెస్ట్ మ్యాక్స్ పీచర్ల గురించి చెప్పాలంటే HMD క్రెస్ట్ మ్యాక్స్ 6.67-అంగుళాల ఫుల్ HD+ OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది Unisoc T760 SoC 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.  దీనిలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. HMD క్రెస్ట్ మాక్స్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50MP ఫ్రంట్ షూటర్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది.

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×